Ravindra Jadeja: కపిల్ దేవ్ 35ఏళ్ల రికార్డు బ్రేక్ చేసిన జడేజా

మరో రికార్డ్ బ్రేక్ చేశాడు టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో కెరీర్‌లోనే బెస్ట్ స్కోరు నమోదు చేశాడు.

Ravindra Jadeja: కపిల్ దేవ్ 35ఏళ్ల రికార్డు బ్రేక్ చేసిన జడేజా

Ravindra Jadeja Subhan 10tv

Ravindra Jadeja: మరో రికార్డ్ బ్రేక్ చేశాడు టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో కెరీర్‌లోనే బెస్ట్ స్కోరు నమోదు చేశాడు. టెస్టు ఫార్మాట్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్ కు దిగి 175 పరుగులు చేసి ఘనత సృష్టించాడు. 35ఏళ్ల క్రితం కపిల్ దేవ్ 163 పరుగుల రికార్డును బ్రేక్ చేశాడు. శ్రీలంకతో 1986 డిసెంబరులో కాన్పూర్ వేదికగా ఈ రికార్డ్ నమోదు చేశారు కపిల్ దేవ్.

ఇదిలా ఉంటే 150కి మించిన స్కోరు నమోదు చేసి మూడో ఇండియన్ గా నిలిచాడు జడేజా. జడేజా, కపిల్ దేవ్ లే కాకుండా యువ క్రికెటర్ రిషబ్ పంత్ సైతం అదే స్థానంలో బ్యాటింగ్ కు దిగి 150కి మించి నమోదు చేసిన సందర్భం మరొకటి ఉంది. 2019లో ఆస్ట్రేలియాలోని సిడ్నీ వేదికగా జరిగిన మ్యాచ్ లో 159పరుగులు బాదేశాడు.

ద గ్రేట్ ఎంఎస్ ధోనీ ఏడో స్థానంలో దిగి నమోదు చేసిన అత్యధిక టెస్టు స్కోరు 144. దక్షిణాఫ్రికాపై 2011లో జరిగిన మ్యాచ్ లో ఇది సాధించాడు.

Read Also: ఆల్ రౌండర్లలో జడేజా నెం.2.. టాప్ 10 బ్యాటింగ్‌లో ముగ్గురు మనోళ్లే..

మరో ఎండ్ లో బ్యాట్స్‌మన్ మారుతున్నా పాతుకుపోయిన జడేజా.. పంత్, అశ్విన్, మొహమ్మద్ షమీలతో కలిసి ఆడి తొలి ఇన్నింగ్స్ లో 8వికెట్ల నష్టానికి 574స్కోరు చేయడానికి కీలకమయ్యాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే సమయానికి జడేజా 175పరుగుల(17ఫోర్లు, 3సిక్సులు)తో ఉండగా షమీ స్కోరు 20.