Raviteja: మీరే చూస్తారు కదా.. అంటూ ‘ధమాకా’పై రవితేజ కాన్ఫిడెంట్!

Raviteja: మీరే చూస్తారు కదా.. అంటూ ‘ధమాకా’పై రవితేజ కాన్ఫిడెంట్!

Raviteja Comments On Dhamaka Movie Goes Viral

Raviteja: మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘ధమాకా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను నక్కిన త్రినాథరావు తెరకెక్కిస్తుండగా, పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందిస్తుంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేశాయి.

Dhamaka: రిలీజ్‌కు ముందే ఓటీటీ లాక్ చేసుకున్న ‘ధమాకా’!

ఇక ఈ సినిమాలో మాస్ రాజా మరోసారి తనదైన ఎనర్జీతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. కాగా, ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, ఇప్పటికే వీరిద్దరి కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందా అనే విషయాన్ని సాంగ్స్‌లో మనకు చూపించేశారు. ఈ సినిమాను దర్శకుడు నక్కిన త్రినాథరావు తనదైన మార్క్ సాలిడ్ మాస్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిస్తుండగా, రవితేజ తన అభిమానులకు కావాల్సిన అన్ని అంశాలు పుష్కలంగా ఉండేలా చూసుకుంటున్నాడు. అయితే తాజాగా రవితేజ తన అభిమానులతో సోషల్ మీడియాలో చిట్ చాట్ చేశారు. ఈ క్రమంలో ధమాకా సినిమా గురించి ఆయన కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Raviteja: మాస్ రాజాతో మరోసారి రచ్చ చేసేందుకు రెడీ అంటోన్న డైరెక్టర్..?

ఈ సినిమాలో ఆయన పాత్ర ప్రేక్షకులు మెచ్చే విధంగా ఉంటుందని, ఈ సినిమా ఎలాంటి ఎనర్జీని ఇస్తుందో మీరే థియేటర్స్‌లో చూస్తారుగా అంటూ అభిమానులకు రవితేజ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ సినిమా గురించి రవితేజ ఏ రేంజ్‌లో కాన్ఫిడెంట్‌గా ఉంటే, ఈ కామెంట్స్ చేస్తాడని నెట్టింట టాక్ నడుస్తోంది. ఏదేమైనా ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రవితేజ రెడీ అయ్యాడనే విషయం మాత్రం అర్థమవుతోంది.