Ravi Teja : రవితేజ కొడుకు ‘ఇడియట్-2’తో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడా.. రవితేజ ఏమన్నాడంటే?

స్టార్ హీరో రవితేజ ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి, ఇండస్ట్రీలో ఒక మాస్ హీరో ఇమేజ్‌ని సొంతం చేసుకొని 'మాస్ మహారాజ్' అనిపించుకుంటున్నాడు. కాగా ఈ హీరో వారసుడు త్వరలో 'ఇడియట్-2' సినిమాతో హీరోగా లాంచ్ అవ్వబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై రవితేజ..

Ravi Teja : రవితేజ కొడుకు ‘ఇడియట్-2’తో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడా.. రవితేజ ఏమన్నాడంటే?

raviteja gave clarity about his son movie debut

Ravi Teja : స్టార్ హీరో రవితేజ ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి, ఇండస్ట్రీలో ఒక మాస్ హీరో ఇమేజ్‌ని సొంతం చేసుకొని ‘మాస్ మహారాజ్’ అనిపించుకుంటున్నాడు. ఈ హీరో నటించిన తాజా చిత్రం ‘ధమాకా’ బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేపుతుంది. విడుదలైన నాలుగు రోజులోనే బ్రేక్ ఈవెన్ సాధించి డబల్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది. ఈ సినిమాతో పాటు చిరంజీవి వాల్తేరు వీరయ్యలో కూడా ఒక అతిధి పాత్రలో నటించాడు రవితేజ.

Dhamaka : 50 కోట్ల ధమాకా.. రవితేజ గ్రాండ్ కమ్ బ్యాక్..

సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా, నిన్న చిత్ర యూనిట్ ఒక ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సమావేశానికి రవితేజ కూడా హాజరయ్యాడు. ఈ క్రమంలో ఒక విలేకరి.. ‘రవితేజ గారు త్వరలో మీ అబ్బాయిని ‘ఇడియట్-2′ సినిమాతో హీరోగా లాంచ్ చేయబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై మీ స్పందన ఏంటి’ అని ప్రశ్నించాడు.

దానికి రవితేజ బదులిస్తూ.. “అసలు అలాంటిది ఏమి లేదండి. ఆ ఉద్దేశమే లేదు. వినడానికే చాలా కొత్తగా ఉంది” అంటూ నవ్వుతూ ఆ వార్తలని కొట్టిపారేశాడు. కాగా రవితేజ కొడుకు గతంలో ‘రాజా ది గ్రేట్’ సినిమాలో రవితేజ చిన్నప్పటి పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. దీంతో త్వరలోనే తన వారసుడిని హీరోగా లాంచ్ చేస్తాడు అని ఫ్యాన్స్ అనుకున్నారు, కానీ రవితేజ మాత్రం తను ఇంకా చిన్న పిల్లవాడే అని చెప్పుకొచ్చాడు.