RCB vs KKR : కష్టాల్లో కోల్ కతా నైట్ రైడర్స్, 75 పరుగులు..నాలుగు వికెట్లు

కోల్ కతా నైట్ రైడర్స్ కష్టాల్లో పడింది. ఐపీఎల్ మ్యాచ్ ల్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడుతోంది.

RCB vs KKR : కష్టాల్లో కోల్ కతా నైట్ రైడర్స్, 75 పరుగులు..నాలుగు వికెట్లు

Kkr

Kolkata Knight Riders : కోల్ కతా నైట్ రైడర్స్ కష్టాల్లో పడింది. ఐపీఎల్ మ్యాచ్ ల్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడుతోంది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. 205 పరుగులను చేధించాలనే లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు జట్టుకు ఆదిలోనే దెబ్బలు తగిలాయి. ఓపెనర్ నితీశ్ రాణా, శుభ్ మన్ గిల్ లు ఆటను ఆరంభించారు జట్టు స్కోరు 23 పరుగుల వద్ద ఉన్నప్పుడు శుభ్ మన్ గిల్ అవుట్ అయ్యాడు. రాణాకు రాహుల్ త్రిపాఠి జత కలిశారు. వీరిద్దరూ కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్త ఆడే ప్రయత్నం చేశారు.

66 పరుగుల వద్ద రాణా (18) వికెట్ కోల్పోయింది. కార్తీక్ (2) పరుగులు చేసి తొందరగా వెనుదిరిగాడు. ప్రస్తుం 11 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసింది. మోర్గాన్ 19, షకీబ్ అల్ హాసన్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. బెంగళూరు జట్టులో చాహల్ 2, కైల్ జేమిసన్, వాషింగ్టన్ సుందర్ చెరో ఒక వికెట్ తీశారు.

Read More : IPL 2021, RCB Vs KKR : బెంగళూరు 204 రన్స్, డివిలియర్స్ విశ్వరూపం