Realme Coca-Cola Phone : రియల్‌మి నుంచి కోకా-కోలా ఫోన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Realme Coca-Cola Phone : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి (Realme) నుంచి కొత్త బ్రాండెడ్ కోకా-కోలా ఫోన్ ఇటీవల ఆన్‌లైన్‌లో లీక్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ గత కొన్ని రోజులుగా ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. లీకైన ఫొటో స్మార్ట్‌ఫోన్ డిజైన్ సూచిస్తోంది.

Realme Coca-Cola Phone : రియల్‌మి నుంచి కోకా-కోలా ఫోన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Realme Coca-Cola Phone Officially Revealed, Hinting at Imminent Launch

Realme Coca-Cola Phone : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి (Realme) నుంచి కొత్త బ్రాండెడ్ కోకా-కోలా ఫోన్ ఇటీవల ఆన్‌లైన్‌లో లీక్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ గత కొన్ని రోజులుగా ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. లీకైన ఫొటో స్మార్ట్‌ఫోన్ డిజైన్ సూచిస్తోంది. ఈ మేరకు రియల్‌మి ద్వారా వెల్లడించింది. సంస్థ వెబ్‌సైట్ ద్వారా కొత్త బ్రాండెడ్ హ్యాండ్‌సెట్‌ను త్వరలో లాంచ్ కానున్నట్టు పేర్కొంది. అయితే, కోకా-కోలా ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలను ఇంకా వెల్లడించలేదు. రీబ్రాండెడ్ Realme 10 4Gగా మార్కెట్లోకి రానుంది. రియల్‌మి Coca-Cola స్పెషల్ ఎడిషన్ ఫోన్ కొత్త ల్యాండింగ్ పేజీలో కనిపించింది.

Realme Coca-Cola Phone Officially Revealed, Hinting at Imminent Launch

Realme Coca-Cola Phone Officially Revealed, Hinting at Imminent Launch

ఈ ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్‌లపై కంపెనీ ఎలాంటి వివరాలను రివీల్ చేయలేదు. హ్యాండ్‌సెట్ వెనుక ప్యానెల్ డిజైన్‌ను ఇటీవల టిప్‌స్టర్ ముకుల్ శర్మ (@stufflistings) ట్విట్టర్‌లో లీక్ చేశారు. రాబోయే కోకా-కోలా ఫోన్ లీకైన ఫొటో డ్యూయల్ కెమెరా సెన్సార్‌లు, LED ఫ్లాష్‌తో రెడ్ కలర్ ఫోన్‌ను సూచిస్తుంది.  ఈ ఫోన్ వెనుక భాగంలో సర్కిల్ ఎడ్జిట్, కోకా-కోలా బ్రాండింగ్‌ను కలిగి ఉంది. స్పెసిఫికేషన్‌లు హ్యాండ్‌సెట్ కోకా-కోలా స్మార్ట్‌ఫోన్ రీబ్రాండెడ్ రియల్‌మి104Gగా ఉంటుంది.

Realme Coca-Cola Phone Officially Revealed, Hinting at Imminent Launch

Realme Coca-Cola Phone Officially Revealed, Hinting at Imminent Launch

గత నవంబర్‌లో ఈ ఫోన్‌ను రిలీజ్ చేశారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.4-అంగుళాల Full-HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ MediaTek Helio G99 SoC ఆన్‌బోర్డ్ ద్వారా అందించనుంది. కెమెరాల విషయానికి వస్తే.. LED ఫ్లాష్‌తో 50-MP డ్యూయల్ రియర్ కెమెరాను అందిస్తుంది. Realme హ్యాండ్‌సెట్‌లో ముందు భాగంలో 16-MP సెల్ఫీ షూటర్ కూడా ఉంది. 33W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. సాఫ్ట్‌వేర్ సపోర్టు కోసం పైన Realme UI 3.0 స్కిన్‌తో ఆండ్రాయిడ్ 12 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌ని రన్ చేస్తుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Realme 10 4G Series : భారీ బ్యాటరీతో రియల్‌మి 4G ఫోన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చు? జనవరి 9నే లాంచ్.. లైవ్ స్ట్రీమింగ్ పూర్తి వివరాలివే..!