Realme 10 4G Series : భారీ బ్యాటరీతో రియల్‌మి 4G ఫోన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చు? జనవరి 9నే లాంచ్.. లైవ్ స్ట్రీమింగ్ పూర్తి వివరాలివే..!

Realme 10 4G Series : ప్రముఖ చైనా టెక్ దిగ్గజం రియల్‌మి (Realme) భారత మార్కెట్లో Realme 10 4Gని జనవరి 09న లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. కంపెనీ కొత్త ఫోన్‌ను లాంచ్ చేసేందుకు డిజిటల్ ఈవెంట్‌ను నిర్వహించనుంది.

Realme 10 4G Series : భారీ బ్యాటరీతో రియల్‌మి 4G ఫోన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చు? జనవరి 9నే లాంచ్.. లైవ్ స్ట్రీమింగ్ పూర్తి వివరాలివే..!

Realme 10 4G to launch on January 09_ What we know so far

Realme 10 4G Series : ప్రముఖ చైనా టెక్ దిగ్గజం రియల్‌మి (Realme) భారత మార్కెట్లో Realme 10 4G లాంచ్ కానుంది. ఈ కొత్త ఫోన్‌ను లాంచ్ చేసేందుకు రియల్‌మి డిజిటల్ ఈవెంట్‌ను నిర్వహించనుంది. జనవరి 09, 2023 (సోమవారం)న  రియల్‌మి 10 4G ఫోన్ రిలీజ్ కానుంది. ఆ రోజు మధ్యాహ్నం 12:30PM గంటలకు ఈవెంట్ Facebook, YouTube వంటి Realme సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో లైవ్ స్ట్రీమింగ్ కానుంది. అంతేకాకుండా, షెడ్యూల్ చేసిన ఈవెంట్‌లో లాంచ్‌ గురించి మరిన్ని వివరాలను Realme వెల్లడించనుంది.

Realme 10 4G కొన్ని ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లను టెక్నాలజీ కంపెనీ ధృవీకరించింది. Realme ప్రకారం.. Realme 10 4G వేరియంట్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. MediaTek Helio G99 SoC ద్వారా పవర్ అందిస్తుంది. MediaTek చిప్‌సెట్‌ను గేమింగ్ SoCగా అభివర్ణించింది. హ్యాండ్‌సెట్‌కు సూపర్‌డార్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుందని కూడా ధృవీకరించింది. Realme 10 ‘లైట్ పార్టికల్ డిజైన్’ కలిగి ఉందని, 178 గ్రాముల బరువు ఉంటుందని తెలిపింది. రియల్‌మి హ్యాండ్‌సెట్ 8GB+8GB వరకు డైనమిక్ RAMతో MediaTek Helio G99 ప్రాసెసర్‌తో వస్తుంది.

Realme 10 4G to launch on January 09_ What we know so far

Realme 10 4G Series to launch on January 09

Read Also : Realme 10 5G Launch in India : రియల్‌మి 10 సిరీస్ 5G మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది.. ఇండియాలో ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

ఆప్టిక్స్ కోసం.. స్మార్ట్‌ఫోన్ వెనుక డ్యూయల్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. 50MP ప్రధాన కెమెరాతో పాటు 2MP B&W కెమెరాతో రావచ్చు. ఫ్రంట్ సైడ్ హ్యాండ్‌సెట్ సెల్ఫీలతో పాటు వీడియో కాల్‌ కోసం 16MP సెన్సార్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. Realme 10 ఫోన్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. 33watt VOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. USB టైప్-C ఛార్జింగ్‌ను అందిస్తుంది. Realme రెండు స్మార్ట్‌ఫోన్‌లకు Android 13 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా Realme UI 4.0ని రిలీజ్ చేయడం ప్రారంభించింది.

ట్విట్టర్ పోస్ట్ ద్వారా కంపెనీ Realme GT Neo 3T, Realme Narzo 50 Pro అప్‌డేట్ అందుబాటులో ఉంది. ఈ అప్‌డేట్ Realme GT Neo 3T ఫర్మ్‌వేర్ వెర్షన్ RMX3371_11.A.09, Realme Narzo 50 Pro RMX3395_11.C.04ని అందిస్తుంది. దశలవారీగా అప్‌డేట్‌ను రిలీజ్ చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. మొత్తం15శాతం మంది వినియోగదారులను క్లిష్టమైన బగ్‌లు లేవని నిర్ధారించుకున్న తర్వాత డిసెంబర్ చివరి నాటికి ఉంటుందని పేర్కొంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Realme 10 Launch in India : ఈ నెల 9న రియల్‌మి 10 సిరీస్ వచ్చేస్తోంది.. కీలక ఫీచర్లు ఇవే.. ధర ఎంత ఉండొచ్చుంటే?