Telangana : ఎండలే ఎండలు.. చరిత్రలో రికార్డు స్థాయికి విద్యుత్ డిమాండ్

రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ రంగం, పరిశ్రమల స్థాపన, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంతోనే విద్యుత్ డిమాండ్ పెరిగిందంటున్నారు. ఒకటి రెండు రోజుల్లోనే 14 వేల 000 మెగావాట్ల...

Telangana : ఎండలే ఎండలు.. చరిత్రలో రికార్డు స్థాయికి విద్యుత్ డిమాండ్

Current

Record Of Electricity Demand : రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెలాఖరుకే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం నుంచే మాడు పగిలేలా ఎండలు దంచుతున్నాయి. ఓ వైపు ఎండ, మరోవైపు ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. నివాసాలు, కార్యాలయాలు, ఇతరత్రా ప్రదేశాల్లో చల్లగా ఉండడం కోసం ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను వినియోగిస్తున్నారు. ఫలితంగా విద్యుత్ కు ఫుల్ డిమాండ్ ఏర్పడుతోంది. ఒక్కరోజులోనే గతంలో ఎప్పుడూ చూడని కరెంటు డిమాండ్ ఉంటోంది. ఇప్పుడే ఇంత డిమాండ్ ఉంటే.. రానున్న రోజుల్లో ఇది అధికం కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Read More : TSSPDCL : కరెంటు సమస్యల ఫిర్యాదుకు యాప్

రాష్ట్రంలో భారీగా విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోదని విద్యుత్ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. 2022, మార్చి 28వ తేదీ సోమవారం సాయంత్రం 3.54 నిమిషాల వరకు ఏకంగా 13 వేల 857 మెగా వాట్ల విద్యుత్ వినియోగం జరిగింది. రాష్ట్ర చరిత్రలోనే ఇది అత్యధిక విద్యుత్ డిమాండ్ అని అధికారులు వెల్లడిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇదే అత్యధిక విద్యుత్ వినియోగంగా నమోదైందన్నారు. మూడు రోజుల క్రితం 13 వేల 742 మెగా వాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్ కాగా సోమవారం 13 వేల 857 మెగా వాట్లు నమోదైందన్నారు.

Read More : Chandigarh : అంధకారంలో చండీగఢ్.. కరెంటు కట్‌‌తో పరిస్థితి అస్తవ్యస్థం

రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ రంగం, పరిశ్రమల స్థాపన, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంతోనే విద్యుత్ డిమాండ్ పెరిగిందంటున్నారు. ఒకటి రెండు రోజుల్లోనే 14 వేల 000 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ రావచ్చని అంచనా వేస్తున్నారు. 16 వేల 000 మెగా వాట్ల విద్యుత్ వినియోగం డిమాండ్ వచ్చినా సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని మరోసారి స్పష్టం చేస్తున్నారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేసేందుకు విద్యుత్ సంస్థలు పని చేస్తాయని ట్రాన్స్ కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు వెల్లడించారు.