Redmi Note 11T Pro : రెడ్‌మి నుంచి కొత్త Note 11T Pro 5G స్మార్ట్‌ఫోన్లు.. ఫీచర్లు, ధర ఎంతంటే?

Redmi Note 11T Pro : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్‌మి నుంచి రెండు కొత్త Note 11T Pro సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ రెండు కొత్త 5G స్మార్ట్ ఫోన్లను రెడ్‌మి కంపెనీ చైనా మార్కెట్లో లాంచ్ చేసింది.

Redmi Note 11T Pro : రెడ్‌మి నుంచి కొత్త Note 11T Pro 5G స్మార్ట్‌ఫోన్లు.. ఫీచర్లు, ధర ఎంతంటే?

| Redmi Note 11T Pro, Note 11 Pro+ launched: Specs, price, and everything else

Redmi Note 11T Pro : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్‌మి నుంచి రెండు కొత్త Note 11T Pro సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ రెండు కొత్త 5G స్మార్ట్ ఫోన్లను రెడ్‌మి కంపెనీ చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. అవే.. Redmi Note 11T Pro, Redmi Note 11T Pro+ స్మార్ట్ ఫోన్లు.. తక్కువ ధరకు హై-ఎండ్ MediaTek 8100 చిప్‌తో యూజర్లను ఆకట్టుకునేలా ఉన్నాయి. భారత మార్కెట్లో రూ. 38,999కు అందుబాటులో ఉన్న OnePlus 10R వంటి ఖరీదైన ఫోన్‌లలోనూ ఇదే టైప్ చిప్‌ని అమర్చారు. అయితే రెండు రెడ్‌మి‌ ఫోన్‌ల మధ్య కొంచెం తేడా ఉండనుంది. ఈ రెండు కొత్త 5G స్మార్ట్ ఫోన్ల స్పెషిఫికేషన్లు, ధర ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

Redmi Note 11T Pro 5G స్పెషిఫికేషన్లు ఇవే :
రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఒకే రకమైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉన్నాయి. బ్యాటరీ యూనిట్, ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా మాత్రమే తేడా ఉంటుంది. Pro వెర్షన్ అయితే 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. ప్లస్ మోడల్ చిన్న 4,400mAh యూనిట్‌ను కలిగి ఉంది. కంపెనీ 120W ఛార్జింగ్ టెక్‌కు సపోర్టు చేస్తుంది. ఈ డివైజ్ 6.6-అంగుళాల FHD+ LTPS డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. ప్యానెల్ 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు కలిగి ఉంటాయి. కానీ, ఇందులో AMOLED స్క్రీన్‌ రాదు.. Redmi Note 11T Pro 5G ఫోన్‌లో LCD డిస్‌ప్లేను మాత్రమే అందిస్తోంది.

Watching Tv For Long Hours Can Increase Risk Of Heart Disease, New Study Reveals (2)

Watching Tv For Long Hours Can Increase Risk Of Heart Disease, New Study Reveals

ఈ డివైజ్‌లో MediaTek డైమెన్సిటీ 8100 SoC పనిచేస్తుంది. 8GB వరకు LPDDR5 RAM, 256GB UFS 3.1 స్టోరేజీతో వచ్చింది. కొత్త రెడ్‌మి ఫోన్ ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ ది బాక్స్‌తో అందిస్తుంది. ఇతర ఫీచర్లలో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు, X-యాక్సిస్ లీనియర్ మోటార్ వంటి మరిన్నో ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. Wi-Fi 6 సపోర్టుతో పాటు NFCకి కూడా సపోర్టు అందిస్తుంది. కెమెరాల విషయానికి వస్తే.. 64-MP ప్రైమరీ కెమెరాతో సహా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందిస్తోంది. 8-MP కెమెరా, 2-MP సెన్సార్‌తో కలిసి వస్తుంది. ఫ్రంట్ సైడ్ కెమెరాలో 16-MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5G ఫోన్‌లు IP53తో వచ్చాయి. నీటి స్ప్లాష్‌లను సైతం తట్టుకోగల సామర్థ్యం ఉంది. Xiaomi 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ను అమర్చారు.

Redmi Note 11T ప్రో సిరీస్: ధర ఎంతంటే? :
Redmi Note 11T Pro స్మార్ట్ ఫోన్ CNY 1,799 ప్రారంభ ధరతో వస్తుంది. భారత మార్కెట్లో దాదాపు రూ. 20,930గా ఉండొచ్చు. డివైజ్‌పై లాంచింగ్ ఆఫర్ ద్వారా ధర CNY 1,699 (సుమారు రూ. 19,770)కి అందుబాటులో ఉండనుంది. మరోవైపు, Redmi Note 11T Pro+ (8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్) ధర CNY 1,999 (సుమారు రూ. 23,260)గా ఉండనుంది. ప్రస్తుతానికి, కొత్త రెడ్‌మి నోట్ సిరీస్ ఫోన్‌లు భారత్‍‌లో ఎప్పుడు లాంచ్ అవుతాయి అనేదానిపై ఎలాంటి సమాచారం లేదు.

Read Also : Redmi 10A : రెడ్‌మి నుంచి మరో బడ్జెట్ ఫోన్.. ఈరోజే లాంచ్.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చంటే?