Revanth Reddy : ఇళ్లు లేని వారికి రూ.5లక్షలు, రుణమాఫీ రూ.2లక్షలు, రూ.500లకే గ్యాస్ బండ-రేవంత్ రెడ్డి హామీ

2024 జనవరి 1న కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఇళ్ళు లేని పేదలందరికి 5లక్షలు ఇస్తుంది. రైతులు ఆత్మహత్య చేసుకోద్దు. రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తాం. బీసీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్ ఇస్తాం. ఆరోగ్య శ్రీ అమలు కు నిధులు కేటాయిస్తాం. గ్యాస్ బండ 500 లకు ఇస్తాం.

Revanth Reddy : ఇళ్లు లేని వారికి రూ.5లక్షలు, రుణమాఫీ రూ.2లక్షలు, రూ.500లకే గ్యాస్ బండ-రేవంత్ రెడ్డి హామీ

Revanth Reddy : తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో పాదయాత్ర భద్రాచలం జిల్లాలో కొనసాగుతోంది. రేవంత్ పాదయాత్రకు నేడు 8వ రోజు. యాత్రలో భాగంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి దేశాన్ని ఏలుతున్నారని మండిపడ్డారు. రామరాజ్యం అంటే ఎన్ని యుగాలైనా ఆదర్శ పరిపాలన ఉండాలన్నారు. చరిత్ర కలిగిన భద్రాచలం వైభవం కోల్పోయిందని రేవంత్ రెడ్డి వాపోయారు.

రామయ్య కల్యాణానికి పట్టు వస్రాలు, తలంబ్రాలు ఇచ్చే అనవాయితీ ఏమైందన్నారు. వంద కోట్లు ఇస్తామన్నారు, టెంపుల్ సిటీ అన్నారు.. అవన్నీ ఏమయ్యాయని నిలదీశారు. శ్రీరామ చంద్రుడుకి కూడా మాట ఇచ్చి తప్పినోడు.. ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేస్తాడా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీతారామ ప్రాజెక్టు కింద భూములు లాక్కున్నారని, నష్ట పరిహారం మాత్రం ఇవ్వలేదన్నారు.

Also Read..MP Komatireddy Venkat Reddy: తెలంగాణలో హంగ్ ఖాయం.. కేసీఆర్ కాంగ్రెస్‌ను పొగడటం పొలిటికల్ డ్రామా

”పవర్ ప్రాజెక్ట్ కి కూడా భూములు లాక్కున్నారు. మిర్చి పంటకు పురుగు వచ్చి దిగుబడి రావటం లేదు. తొమ్మిదేళ్లలో కేసీఆర్ పది బడ్జెట్లు‌ పెట్టారు. 5 లక్షల 29 వేల కోట్లు అప్పులు తెచ్చారు. భద్రాచలం అసెంబ్లీకి 20వేల కోట్లు రావాలి. రాముల వారి గుడికి వంద కోట్లు ఇవ్వలేక పోయారు. సన్యాసి పినపాక ఎమ్మెల్యే. ఎక్కడో గాడిదలు కాసే నిన్ను రెండుసార్లు ఎంఎల్ఏ చేసింది కాంగ్రెస్ పార్టీ. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల దగ్గర ఓట్లు అడుగుతాం. మీ డబుల్ బెడ్ రూం ఇళ్ల దగ్గర ఓట్లు అడుగు.

Also Read..Central Minister Kishan Reddy: భయంకరమైన నిజాలు అంటూ.. కేసీఆర్ పాలనపై ఆసక్తికర ట్వీట్ చేసిన కిషన్ రెడ్డి

బుడబుక్కల పార్టీ బిజెపి. కోడిగుడ్డు మీద బొచ్చు వచ్చేది లేదు. తెలంగాణలో బిజెపి వచ్చేది లేదు. తెలంగాణలో కాంగ్రెస్ లేదంటావా. కొత్త సంవత్సరం 2024 జనవరి 1న కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఇళ్ళు లేని పేదలందరికి 5లక్షలు ఇస్తుంది. రైతులు ఆత్మహత్య చేసుకోద్దు. రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తాం. బీసీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్ ఇస్తాం. ఆరోగ్య శ్రీ అమలు కు నిధులు కేటాయిస్తాం. గ్యాస్ బండ 500 లకు ఇస్తాం. పోడు భూముల్లో అర్హులైన వారికి పట్టాలి ఇస్తాం. భద్రాచలంను కుట్రపూరితంగా మూడు ముక్కలు చేసినోడిని మూడు అడుగుల గుంటలో పాతరేయాలి” అని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.