RGV: నీ మొహం రా.. అంటూ కేఏ పాల్‌కు వర్మ కౌంటర్!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సెన్సేషన్ అవుతుందని ఇండస్ట్రీలో ఒక టాక్ బలంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన తీసే సినిమాలకంటే కూడా సోషల్ మీడియా....

RGV: నీ మొహం రా.. అంటూ కేఏ పాల్‌కు వర్మ కౌంటర్!

Rgv Comment On Ka Paul Over Rrr Movie

RGV: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సెన్సేషన్ అవుతుందని ఇండస్ట్రీలో ఒక టాక్ బలంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన తీసే సినిమాలకంటే కూడా సోషల్ మీడియా వేదికగా ఆయన చేసే కామెంట్స్ వర్మను ఎక్కువగా లైమ్‌లైట్‌లో ఉంచుతున్నాయి. కాగా తాజాగా ఆయన డేంజరస్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ఇద్దరు అమ్మాయిల మధ్య ప్రేమ అనే కథాంశంతో ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌పై వర్మ చేసిన కామెంట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

RGV: కేసీఆర్ బయోపిక్ ఖాయమంటోన్న వర్మ!

టాలీవుడ్‌లో ఇటీవల రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ చిత్రంపై సినిమా రంగానికి చెందిన వారితో పాటు ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే కేఏ పాల్ మాత్రం ఈ సినిమాకు సంబంధించి నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నట్లు ఓ యూట్యూబ్ ఛానల్‌లో కనిపించారు. ఇక దీనికి సంబంధించిన వీడియో థంభ్‌నేల్‌లో RRR సినిమాను చూడొద్దని.. టైమ్ వేస్ట్ సినిమా అని కేఏ పాల్ చెబుతున్నట్లుగా సదరు యూట్యూబ్ ఛానల్ వారు పెట్టారు. దీన్నే స్ర్కీన్‌షాట్ తీసిన వర్మ ‘‘నీ మొహం రా..’’ అంటూ కేఏ పాల్‌కు కౌంటర్ ఇచ్చారు.

RGV : నాకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయి..

దీంతో ఒక్కసారిగా నెటిజన్లు వర్మ చేసిన ఈ కామెంట్‌ను వైరల్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి ప్రెస్టీజియస్ మూవీపై కేఏ పాల్ లాంటి వారు ఇలా నెగెటివ్ కామెంట్స్ ఎందుకు చేస్తున్నారో వారికే తెలియాలంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాపై, దర్శకుడు రాజమౌళిపై వర్మ ఇటీవల ప్రశంసల వర్షం కురిపిస్తూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఏదేమైనా కేఏ పాల్ వీడియో చూసి నెటిజన్లు కూడా వర్మ తరహాలో కామెంట్స్ చేస్తూ మండిపడుతున్నారు. అయితే ఆ వీడియోలో మాత్రం కేఏ.పాల్ ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ప్రత్యేకించి విమర్శించకపోవడం గమనార్హం. తనకు ఆర్ఆర్ఆర్ అనే సినిమా గురించి తెలియదని కేఏ పాల్ చెప్పుకొచ్చారు.