RGV: కేసీఆర్ బయోపిక్ ఖాయమంటోన్న వర్మ!

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించే సినిమాలపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల చూపులు కూడా ఉంటాయి. ఆయన తెరకెక్కించే సినిమాలు ఎలాంటి కంటెంట్‌తో వస్తాయా....

RGV: కేసీఆర్ బయోపిక్ ఖాయమంటోన్న వర్మ!

Ram Gopal Varma To Direct Kcr Biopic

RGV: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించే సినిమాలపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల చూపులు కూడా ఉంటాయి. ఆయన తెరకెక్కించే సినిమాలు ఎలాంటి కంటెంట్‌తో వస్తాయా అని అందరూ ఆసక్తిగా చూస్తుంటారు. అయితే ఇటీవల ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ కూడా నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతూ వస్తున్నాయి. కాగా వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం ‘డేంజరస్’ ప్రస్తుతం రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాలో అందాల భామలు అప్సరా రాణి, నైనా గంగూలీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Apsara Rani: కోరిక తీరిస్తేనే ఛాన్స్.. క్యాస్టింగ్ కౌచ్‌పై అప్సర!

ఇద్దరు అమ్మాయిల మధ్య ప్రేమ.. దాని పరిణామం అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా వస్తుండటంతో వర్మ ఈ చిత్రాన్ని ఎలా తెరకెక్కించాడా అనే ఆతృత అందరిలోనూ నెలకొంది. ఇక గతంలో ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశాయి. కాగా తాజాగా ఈ సినిమాలోని మరో ట్రైలర్‌ను చిత్ర యూనిట్ ఢిల్లీలో లాంఛ్ చేశారు. ఈ ట్రైలర్ లాంఛ్ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు చిత్ర యూనిట్. ఈ ప్రెస్ మీట్‌లో వర్మ కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. సమాజంలో ఇద్దరు అమ్మాయిల మధ్య ప్రేమ చిగురిస్తే అది ఎలా ఉంటుందనే అంశంతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు వర్మ పేర్కొన్నారు. ఇక ఈ సినిమాలో నైనా గంగూలీ, అప్సరా రాణిలు తమ పాత్రలకు వందశాతం న్యాయం చేశారంటూ వర్మ చెప్పుకొచ్చాడు.

కాగా బయోపిక్ చిత్రాలను తెరకెక్కించే వర్మ, తెలంగాణ సీఎం కేసీఆర్ బయోపిక్ తీస్తారా అని మీడియా వారు అడగగా.. ఖచ్చితంగా తీస్తానని.. కానీ దానికి ఇంకా సమయం పడుతుందని వర్మ తెలియజేశాడు. బయోపిక్ చిత్రాలు ఊరికే రావని.. వాటి వెనకాల చాలా రిసెర్చ్, కృషి ఉంటుందని ఆయన అన్నారు. ఇక ఏపీలో నెలకొన్న టికెట్ రేట్ల వివాదంపై తనకు ఎలాంటి ఇబ్బంది లేదని వర్మ అన్నారు.

RGV : ‘రాధేశ్యామ్’కి అంత బడ్జెట్ అవసరం లేదు.. ఆర్జీవీ కామెంట్స్..

మొత్తానికి వర్మ మరోసారి అందరి చూపులను తనవైపుకు తిప్పుకునేందుకు డేంజరస్ అనే సినిమాతో మనముందుకు రాబోతున్నాడని.. త్వరలోనే కేసీఆర్ బయోపిక్‌ను కూడా తెరకెక్కిస్తానని వర్మ చెప్పడంతో ఇప్పుడు ఈ సినిమా గురించి ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా చర్చ మొదలైంది. గతంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే సినిమాతో వర్మ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో అందరికీ తెలిసిందే. మరి కేసీఆర్ బయోపిక్‌తో వర్మ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.