Rohit Sharma : టీ20 క్రికెట్‌లో రోహిత్ శర్మ రికార్డ్.. తొలి ఇండియన్ క్రికెటర్

భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన కెరీర్ లో మరో రికార్డు సృష్టించాడు. ఇంగ్లండ్ తో రెండో టీ20లో 2 ఫోర్లు కొట్టడంతో రోహిత్ ఈ ఘనత సాధించాడు.

Rohit Sharma : టీ20 క్రికెట్‌లో రోహిత్ శర్మ రికార్డ్.. తొలి ఇండియన్ క్రికెటర్

Rohit Sharma

Rohit Sharma : భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన కెరీర్ లో మరో రికార్డు సృష్టించాడు. ఇంటర్నేషనల్ టీ20ల్లో 300 ఫోర్లు కొట్టిన రెండో క్రికెటర్ గా రోహిత్ శర్మ ఘనత సాధించాడు. ఇంగ్లండ్ తో రెండో టీ20లో 2 ఫోర్లు కొట్టడంతో రోహిత్ ఈ రికార్డు సాధించాడు.

కాగా, భారత్ నుంచి 300 ఫోర్లు బాదిన తొలి ప్లేయర్ రోహిత్ శర్మనే కావడం విశేషం. అంతర్జాతీయ టీ20లలో అత్యధిక ఫోర్లు బాదిన క్రికెటర్ గా ఐర్లాండ్ బ్యాటర్ పాల్ స్టిర్లింగ్ టాప్ లో ఉన్నాడు. స్టిర్లింగ్ 325 ఫోర్లు బాదాడు. విరాట్ కోహ్లి 298 ఫోర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక సిక్సర్లలో గప్తిలో(165) టాప్ లో ఉండగా.. రోహిత్ (157) రెండో స్థానంలో ఉన్నాడు.

Arshdeep Singh: అరంగ్రేటంలోనే అదరగొట్టేశాడు.. 16ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన భారత యువ బౌలర్

ఇంగ్లండ్ తో రెండో టీ20లో రోహిత్ శర్మ మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. కానీ, త్వరగానే ఔటయ్యాడు. 20 బంతుల్లో 2 సిక్సర్లు, 3 ఫోర్లతో 31 రన్స్ చేశాడు. షాట్ కోసం ప్రయత్నించి గ్లీసన్ బౌలింగ్ లో కీపర్ బట్లర్ కు క్యాచ్ ఇచ్చాడు.

ఇంగ్లండ్ తో రెండో టీ20లో రోహిత్ శర్మ మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. కానీ, త్వరగానే ఔటయ్యాడు. 20 బంతుల్లో 2 సిక్సర్లు, 3 ఫోర్లతో 31 రన్స్ చేశాడు. షాట్ కోసం ప్రయత్నించి గ్లీసన్ బౌలింగ్ లో కీపర్ బట్లర్ కు క్యాచ్ ఇచ్చాడు.

Virat Kohli : కోహ్లీపై కపిల్‌ దేవ్ షాకింగ్ కామెంట్స్.. జట్టులో విరాట్‌ను ఎందుకు తప్పించకూడదు..!

తొలి టీ20లో ఇంగ్లండ్ పై గెలిచి ఉత్సాహంతో ఉన్న టీమిండియా రెండో టీ20కి సిద్ధమైంది. బర్మింగ్ హామ్ లోని ఎడ్జ్ బాస్టన్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. అందుకే ఈ మ్యాచ్ కోసం రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రాకు చోటు కల్పించారు. తొలి టీ20లో తన బౌలింగ్ తో ఆకట్టుకున్న యువ పేసర్ అర్షదీప్ సింగ్ ను ఈ మ్యాచ్ కు పక్కనబెట్టారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ఇక, ఆతిథ్య ఇంగ్లండ్ జట్టులో రెండు మార్పులు చేసినట్టు కెప్టెన్ జోస్ బట్లర్ తెలిపాడు. రీస్ టాప్లే, టైమల్ మిల్స్ స్థానంలో డేవిడ్ విల్లే, రిచర్డ్ గ్లీసన్ జట్టులోకి వచ్చారని వివరించాడు.