Roja – Balakrishna : బాలయ్యకు రోజా ఫోన్ కాల్.. ‘జబర్దస్త్’కి వస్తానని చెప్పిన నటసింహం..

సీనియర్ నటి రోజా ‘జబర్దస్త్’ షో నుండి నందమూరి బాలకృష్ణకు కాల్ చేసి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

Roja – Balakrishna : బాలయ్యకు రోజా ఫోన్ కాల్.. ‘జబర్దస్త్’కి వస్తానని చెప్పిన నటసింహం..

Roja – Balakrishna: సీనియర్ నటి, ఆంధ్రప్రదేశ్, నగరి ఎమ్మెల్యే రోజా, నటసింహా, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఫోన్ చేసి మాట్లాడిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. అనసూయ హోస్ట్‌గా రోజా, మనో జడ్జిలుగా వ్యవహరిస్తున్న ‘జబర్దస్త్’ లేటెస్ట్ ప్రోమో రీసెంట్‌గా రిలీజ్ చేశారు.

Unstoppable Sneak Peak : కలుద్దాం.. ‘ఆహా’లో.. డిజిటల్ స్క్రీన్ దద్దరిల్లాల్సిందే..

అనసూయ, రోజాతో ‘ ఈరోజు మా అందరి సమక్షంలో బాలయ్య బాబుకి కాల్ చెయ్యాలి’ అంటే.. రోజా ‘మంచి మూడ్‌లో ఉంటే ఓకే.. లేకపోతే?’ అంటూ బాలయ్యకి కాల్ చేశారు. ఫోన్ లిఫ్ట్ చెయ్యగానే బాలయ్య- ఆ.. రోజా గారు నమస్కారం.. రోజా- హలో, బాగున్నారా..
బాలయ్య- ఆ, బాగున్నా బాగున్నా.. అనగానే అనసూయతో సహా టీం అంతా బాలయ్య వాయిస్ విని ఆశ్చర్యపోయారు.
బాలయ్య- మీరు బాగున్నారా..
రోజా- బాగున్నాను సార్.. ‘జబర్దస్త్‌’లో ఉన్నా.. మీరేం చేస్తున్నారు సార్..

Allu Arjun : ఈ బుల్లెట్ మీద ఎన్ని చలాన్లు ఉన్నాయో తెలుసా

బాలయ్య- మన అఖండ షూటింగ్‌ జరుగుతాంది.. మన అఖండ..
రోజా- మళ్లీ మనమిద్దరం కలిసి ఎప్పుడు యాక్ట్ చేద్దాం.. ‘భైరవ ద్వీపం’ పార్ట్-2ఆ, లేక ‘బొబ్బిలి సింహం’ పార్ట్-2 ఆ అని అడుగుతున్నారు.
పెద్దగా నవ్వేసి, బాలయ్య- అందరు ఎదురు చూస్తున్నారు మన కాంబినేషన్ కోసం.. జబర్ధస్త్ స్టూడియోకి కూడా వస్తాను నేను తప్పకుండా..
అంటూ రాఘవ, ఆది, అభిలను పలకరించారు. ఈ ప్రోమో సోషల్ మీడియాలో, బాలయ్య ఫ్యాన్ పేజీల్లో, వాట్సాప్ స్టేటసుల్లో తెగ చక్కర్లు కొడుతోంది.