RRR: అక్కడ మైల్‌స్టోన్ మార్క్‌ను అందుకున్న ఆర్ఆర్ఆర్!

టాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ అయ్యి మూడు వారాలు దాటినా ఈ సినిమాకు ఆదరణ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి...

RRR: అక్కడ మైల్‌స్టోన్ మార్క్‌ను అందుకున్న ఆర్ఆర్ఆర్!

RRR

RRR: టాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ అయ్యి మూడు వారాలు దాటినా ఈ సినిమాకు ఆదరణ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ పీరియాడికల్ ఫిక్షన్ మూవీని తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ రిలీజ్ చేయడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు బారులు తీరారు. బాహుబలి తరువాత జక్కన్న తెరకెక్కించిన సినిమా కావడంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూశారు.

Ram Charan : పంజాబ్ లో RC15 షూట్.. RRR ఎఫెక్ట్.. చరణ్‌తో ఫోటోల కోసం పంజాబ్ పోలీసుల క్యూ..

ఇక ఇద్దరు స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించడంతో ఈ సినిమాలో వారి పర్ఫార్మెన్స్‌లు చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు. కాగా అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమురం భీంగా తారక్ పాత్రల్లో వారి కెరీర్‌లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో ఈ సినిమా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తూ వసూళ్ల వర్షం కురిపించింది. ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.1000 కోట్ల మార్క్‌ను ఎప్పుడో దాటిపోయింది.

RRR: ఆర్ఆర్ఆర్ 22 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్.. ఎంతంటే?

కాగా తాజాగా హిందీ మార్కెట్‌లో ఆర్ఆర్ఆర్ అదిరిపోయే సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఆర్ఆర్ఆర్ ఏకంగా రూ.250 కోట్ల గ్రాస్ వసూళ్ల మార్క్‌ను దాటి తెలుగు సినిమా సత్తాను మరోసారి బాలీవుడ్ జనాలకు చూపించింది. ఇటీవల కాలంలో బాలీవుడ్‌లో ఈ రేంజ్‌లో వసూళ్లు సాధించిన సినిమాగా ఆర్ఆర్ఆర్ నిలిచిందని చిత్రం వర్గాలు అంటున్నాయి. కాగా ఈ సినిమాలో ఆలియా భట్, అజయ్ దేవ్గన్, ఒలివియా మారిస్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.