RRR: ఆర్ఆర్ఆర్ 22 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్.. ఎంతంటే?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం) మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాల మధ్య రిలీజ్.....

RRR: ఆర్ఆర్ఆర్ 22 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్.. ఎంతంటే?

RRR

RRR: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం) మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా అవతరించింది. ఇక ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు క్యూ కట్టడం మనం చూశాం.

RRR : ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్.. చైనా, జపాన్‌తో సహా మరో 30 దేశాల్లో త్వరలో..

కాగా ఆర్ఆర్ఆర్ చిత్రానికి తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ దక్కింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రీతిలో వసూళ్లను రాబడుతూ దూసుకెళ్తోంది. ఈ సినిమా రిలీజ్ అయ్యి 22 రోజులు ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1063 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక షేర్ వసూళ్లపరంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రాబట్టిన కలెక్షన్స్ రూ.578.82 కోట్లు.

RRR : ‘ఆర్ఆర్ఆర్’లో చరణ్ డామినేషన్ పై రాజమౌళి వ్యాఖ్యలు

తారక్, చరణ్‌ల నటవిశ్వరూపానికి యావత్ సినీ ప్రేమికులు నీరాజనం పలకగా.. ఈ సినిమా ఇద్దరు హీరోల కెరీర్‌లో ఓ మైల్‌స్టోన్ మూవీగా నిలిచిపోవడం ఖాయం. అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమురం భీమ్‌గా తారక్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధలను చేసింది. ఇక ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా 22 రోజుల్లో కలెక్ట్ చేసిన వసూళ్ల వివరాలు ఏరియాలవారీగా ఈ విధంగా ఉన్నాయి..

నైజాం – రూ.108.93 కోట్లు
సీడెడ్ – రూ.49.67 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ.33.92 కోట్లు
ఈస్ట్ – రూ.15.66 కోట్లు
వెస్ట్ – రూ.12.84 కోట్లు
గుంటూరు – రూ.17.66 కోట్లు
కృష్ణా – రూ.14.21 కోట్లు
నెల్లూరు – రూ.9.02 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – రూ.261.91 కోట్లు(షేర్) (రూ.395 కోట్లు గ్రాస్)
కర్ణాటక – రూ.42.42 కోట్లు
తమిళనాడు – రూ.37.26 కోట్లు
కేరళ – రూ.10.28 కోట్లు
హిందీ – రూ.120.50 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – రూ.8.80 కోట్లు
ఓవర్సీస్ – రూ.96.65 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – రూ.578.82 (షేర్) (రూ.1063.70 కోట్లు గ్రాస్)