RRR : ‘ఆర్ఆర్ఆర్’లో చరణ్ డామినేషన్ పై రాజమౌళి వ్యాఖ్యలు

రాజమౌళి మాట్లాడుతూ. ''ఇందులో ఎవరి డామినేషన్‌ లేదు, తారక్‌, చరణ్‌లు ఇద్దరూ తమ బెస్ట్‌ ఇచ్చారు. చరణ్ డామినేషన్ ఎక్కువగా ఉంది అన్నమాట కరెక్ట్ కాదు. ఏదైనా మనం చూసే..........

RRR :  ‘ఆర్ఆర్ఆర్’లో చరణ్ డామినేషన్ పై రాజమౌళి వ్యాఖ్యలు

Rrr (1)

 

Rajamouli :  చరణ్, తారక్ కాంబినేషన్ లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా మంచి విజయం సాధించి భారీ కలెక్షన్లని సాధించిన సంగతి తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్, నాగేశ్వర రావు ఉన్న కాలంలో స్టార్ హీరోల మల్టీస్టారర్ లు ఉండేవి. ఆ తర్వాత మల్టీస్టారర్ స్టార్ హీరోలు ఎవ్వరూ తీయలేదు. ఒకవేళ ఎవరైనా తీస్తే, అందులో ఒకర్ని ఎక్కువ చూపించి ఇంకొకరిని కొంచెం తక్కువ చూపించినా అభిమానుల మధ్య గొడవలు జరగడం ఖాయం. దీంతో చాలా సంవత్సరాలుగా స్టార్ హీరోలతో ఎవరూ మల్టీస్టారర్ ట్రై చేయలేదు.

 

ఆర్ఆర్ఆర్ తీస్తున్న సమయంలో ఇద్దరు స్టార్లతో తీసిన మల్టీస్టారర్ కావడంతో అభిమానులు తమ హీరో తమ హీరో అని కొట్టుకుంటారు అని అంతా అనుకున్నారు. కానీ రాజమౌళి అందుకు అవకాశం ఇవ్వలేదు. ఇద్దరికీ అన్ని విషయాల్లోనూ సమానంగా స్కోప్ ఇస్తూ సినిమాని తీశారు. సినిమా విడుదల అయిన తర్వాత కూడా చాలా కాలం తర్వాత పర్ఫెక్ట్ మల్టీస్టారర్ అని అందరూ పొగిడారు. అయితే కొంతమంది మాత్రం ఎన్టీఆర్ కి స్క్రీన్ స్పేస్ ఎక్కువ సేపు ఇవ్వలేదని వ్యాఖ్యలు చేశారు.

 

నటన పరంగా చరణ్, తారక్ లు ఇద్దరూ సమానంగా మెప్పించినా స్క్రీన్ పై చరణ్ ఎక్కువ సేపు కనపడ్డాడు, తారక్ తక్కువ సేపు కనపడ్డాడు అంటూ కొంతమంది ఎన్టీఆర్ అభిమానులు ఈ అంశాన్ని లేవనెత్తారు. మరి కొంతమంది విమర్శలు కూడా చేశారు. అయితే కొంతమంది అన్న ఈ మాటల్ని ఎవరూ పట్టించుకోకుండా సినిమాని ఎంజాయ్ చేశారు. ఇలాంటి గొడవలు రాకుండా ఉండటానికే చరణ్, తారక్ లు ఇద్దరూ కూడా మొదటి నుంచి వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి స్నేహం ఉందో చెప్తూనే సినిమాని ప్రమోట్ చేశారు. కానీ కొంతమంది మాత్రం సినిమాలో చరణ్ డామినేషన్ ఉందంటూ వ్యాఖ్యలు చేశారు.

 

Sonam Kapoor : సోనమ్ కపూర్ ఇంట్లో భారీ చోరీ.. ఇంట్లో పనిమనిషే 2.4 కోట్ల అపహరణ..

తాజాగా ఈ వ్యాఖ్యలపై రాజమౌళి స్పందించారు. ఇటీవల ముంబైలో జరిగిన సక్సెస్ మీట్ లో కూడా రాజమౌళికి ఈ ప్రశ్న ఎదురైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి ఈ ప్రశ్నకి సమాధానమిచ్చారు. రాజమౌళి మాట్లాడుతూ. ”ఇందులో ఎవరి డామినేషన్‌ లేదు, తారక్‌, చరణ్‌లు ఇద్దరూ తమ బెస్ట్‌ ఇచ్చారు. చరణ్ డామినేషన్ ఎక్కువగా ఉంది అన్నమాట కరెక్ట్ కాదు. ఏదైనా మనం చూసే దృష్టిలో ఉంటుంది. క్లైమాక్స్‌లో రామ్ చరణ్‌కు ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉండడం వల్ల కొంతమంది ప్రేక్షకులకి అలా అనిపించొచ్చు, అదే నేను కొమురం భీముడో పాట దగ్గరే క్లైమాక్స్ పెడితే అప్పుడు ఎన్టీఆర్ డామినేషన్ ఉంది అనేవారు.”

Ujwal : కేజీఎఫ్ సినిమాని 19 ఏళ్ళ కుర్రాడి చేతిలో పెట్టిన ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్ అసలు హీరో ఇతనే..

”అంతేకాక సినిమాలో తారక్‌, చరణ్‌ను రెండుసార్లు రక్షించాడు. చరణ్‌ మాత్రం తారక్‌ను ఒక్కసారి మాత్రమే సేవ్‌ చేస్తాడు అప్పుడు తారక్ డామినేషన్ అనుకోవచ్చు గా. అంతేకాక చరణ్, తారక్ ని ప్రశంసిస్తాడు సినిమాలో ఈ విధంగా చూస్తే తారక్ డామినేషన్ కనపడుతుంది. సినిమాని మనం చూసే దాన్నిబట్టి ఉంటుంది. సినిమా అనేది కథకి తగ్గట్టుగా తెరకెక్కిస్తారు.” అంటూ తెలిపారు. ఎవరు ఏమనుకున్నా సినిమా మాత్రం మంచి విజయం సాధించి 1000 కోట్ల కలెక్షన్లని సాధించింది. ఈ జనరేషన్ లో బెస్ట్ మల్టీస్టారర్ గా నిలిచింది.