Ujwal : కేజీఎఫ్ సినిమాని 19 ఏళ్ళ కుర్రాడి చేతిలో పెట్టిన ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్ అసలు హీరో ఇతనే..

అన్నిటికంటే కష్టమైన పని ఎడిటింగ్. దానికి ఎంతో ఓపిక ఉండాలి. ఎడిటింగ్ లో చిన్న తప్పు ఉన్నా సినిమాకి మైనస్ అవుతుంది. అలాంటిది ఇండస్ట్రీలో ఎంతోమంది సీనియర్ ఎడిటర్లు ఉన్నా..........

Ujwal :  కేజీఎఫ్ సినిమాని 19 ఏళ్ళ కుర్రాడి చేతిలో పెట్టిన ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్ అసలు హీరో ఇతనే..

Kgf Editor

KGF2 :  ఒక సినిమా ఎంత బాగా తీసినా అది ఇంకా బాగా ప్రేక్షకులకి కనెక్ట్ అవ్వాలి అంటే కావాల్సింది మంచి ఎడిటింగ్. ఎడిటింగ్ ఎంత బాగా ఉంటే జనాలు సినిమాకి అంత బాగా కనెక్ట్ అవుతారు. గతంలో ఎన్నో సినిమాలు ఎడిటింగ్ బాగోలేక ప్లాప్ అయిన సినిమాలు ఉన్నాయి, ఎడిటింగ్ బాగుండి హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. ఒక సినిమాని ఎలా ఆర్డర్ లో పెట్టాలి. ఏ సీన్ తర్వాత ఏ సీన్ రావాలి, ఏ సీన్ స్లోగా ఉండాలి, ఏ సీన్ ఫాస్ట్ గా ఉండాలి.. ఇవన్నీ డైరెక్టర్ తో పాటు ఎడిటర్ కే బాగా తెలిసి ఉండాలి. ఒక సినిమాని ఎడిట్ చేస్తే ఎక్కడా కూడా కట్ చేసి అతికించినట్లు ఉండకూడదు.

 

ఇండస్ట్రీలో చాలా మంది పేరున్న ఎడిటర్లు ఉన్నారు. నేషనల్ అవార్డు సాధించిన ఎడిటర్లు కూడా ఉన్నారు. అన్నిటికంటే కష్టమైన పని ఎడిటింగ్. దానికి ఎంతో ఓపిక ఉండాలి. ఎడిటింగ్ లో చిన్న తప్పు ఉన్నా సినిమాకి మైనస్ అవుతుంది. అలాంటిది ఇండస్ట్రీలో ఎంతోమంది సీనియర్ ఎడిటర్లు ఉన్నా ఏకంగా కేజిఎఫ్2 సినిమాని తీసుకెళ్లి ప్రశాంత్ నీల్ ఎడిటింగ్ చేయమని ఓ 19 ఏళ్ళ కుర్రాడి చేతిలో పెట్టారు. నిర్మాతలు, పలువురు సినీ ప్రముఖులు చాలా మంది వద్దు రిస్క్ చేయొద్దు అంటూ ప్రశాంత్ నీల్ కి చెప్పినా వినకుండా కేజిఎఫ్ 1 సినిమాకి చేసిన ఎడిటర్ ని కూడా పక్కన పెట్టి ఆ 19 ఏళ్ళ కుర్రాడి చేతిలో కేజిఎఫ్ 2 సినిమాని పెట్టి ఎడిటింగ్ చేయమన్నారు.

 

ఆ 19 ఏళ్ళ కుర్రాడి పేరు ఉజ్వల్ కులకర్ణి. షార్ట్ ఫిలిమ్స్, ఫ్యాన్ వీడియోలు ఎడిట్ చేస్తూ ఉంటాడు ఈ అబ్బాయి. మరి ఇలా షార్ట్ ఫిలిమ్స్, సోషల్ మీడియాలో వీడియోలు ఎడిట్ చేసే అబ్బాయికి ప్రశాంత్ నీల్ సినిమా ఎలా ఇచ్చారు అని అందరికి ఆశ్చర్యం వేసింది. గతంలో ఫ్యాన్ వీడియోలు ఎడిట్ చేస్తూ కేజిఎఫ్ 1 సినిమాకి సంబంధించి ఓ ఫ్యాన్ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి ఎడిట్ చేశాడు. ఈ వీడియో ప్రశాంత్ నీల్ దాకా వెళ్ళింది. ఆ వీడియో ఎడిటింగ్ చూసి ఆశ్చర్యపోయాడు ప్రశాంత్.

 

దీంతో ప్రశాంత్ ఈ కుర్రాడిని పిలిపించాడు. షార్ట్ ఫిలిమ్స్, చిన్న చిన్న వీడియోలు ఎడిట్ చేసే ఉజ్వల్ కి ప్రశాంత్ నుంచి కాల్ రాగానే షాక్ అయ్యాడు. మొత్తానికి ప్రశాంత్ ని కలవగా నీ వర్క్ చూశాను, బాగుంది అని చెప్పి కేజిఎఫ్ సినిమాలోని కొన్ని సీన్స్ ని ఇచ్చి టీజర్ కట్ చేయమన్నారు. సరే అని ఉజ్వల్ కేజిఎఫ్ 2 టీజర్ కట్ చేసి చూపించగా ప్రశాంత్ కి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ప్రశాంత్ కే కాదు దేశంలోని ప్రేక్షకులందరికీ ఆ టీజర్ విపరీతంగా నచ్చేసింది. అందుకే ఆ టీజర్ కి ఏకంగా 200 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

 

KGF2: ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకున్న కేజీయఫ్-2

దీంతో ప్రశాంత్ ఉజ్వల్ ని మరింత నమ్మి ఈ సారి ఏకంగా కేజిఎఫ్ 2 సినిమానే ఎడిట్ చేయమన్నాడు. కేజిఎఫ్ 1 సినిమాకి ఎడిటర్ గా పని చేసిన శ్రీకాంత్ గౌడని పక్కనపెట్టి ఈ కుర్రాడికి ఛాన్స్ ఇచ్చారు. భారీ బడ్జెట్ సినిమా, రిస్క్ వద్దు అంటూ చాలా మందికి ప్రశాంత్ నీల్ కి చెప్పినా నన్ను నమ్మండి అంటూ కేజిఎఫ్ 2 రష్ మొత్తం తీసుకెళ్లి ఉజ్వల్ చేతిలో పెట్టాడు. మొదట ఇంత పెద్ద సినిమా నేను చేయగలనా అని ఉజ్వల్ అనుకోగా పర్లేదు ధైర్యంగా చెయ్ అంటూ మరింత సపోర్ట్ ఇచ్చారు నీల్. దీంతో ఉజ్వల్ కేజిఎఫ్ 2 సినిమాని అద్భుతంగా ఎడిట్ చేసి ఇచ్చాడు.

KGF2: రాఖీ భాయ్ దెబ్బకు ‘బీస్ట్’ ఖతం..?

 

ఇప్పుడు థియేటర్లలో సినిమా చూసిన వారంతా సినిమాని ఏ రేంజ్ లో పొగుడుతున్నారో తెలిసిందే. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కేజిఎఫ్ 2 బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా చూసిన వాళ్లంతా ఎడిటర్ ఉజ్వల్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. సినీ ప్రముఖులంతా ఉజ్వల్ ట్యాలెంట్ కి ఆశ్చర్యపోతున్నారు. ప్రశాంత్ నీల్ నమ్మకం నిజమైంది అంటూ అభినందనలు తెలియచేస్తున్నారు. ఇక ఉజ్వల్ రాత్రికి రాత్రి సెలబ్రిటీ అయిపోయాడు ఈ సినిమాతో. తన సోషల్ మీడియా ఫాలోవర్స్ కూడా అమాంతం పెరుగుతున్నారు. మీడియా సంస్థలు, యూట్యూబ్ చానళ్ళు ఉజ్వల్ ఇంటర్వ్యూల కోసం క్యూ కడుతున్నాయి. భవిష్యతు లో ఉజ్వల్ మరిన్ని భారీ సినిమాలు కచ్చితంగా ఎడిట్ చేస్తాడు, మరింత ఎత్తుకు ఎదుగుతాడు.

 

ఉజ్వల్ కి కేజిఎఫ్2 సినిమాకి ఎడిటర్ గా ఛాన్స్ రావడానికి కారణమైన వీడియో ఇదే..