RRR : ముంబైలో చరణ్, తారక్‌లకు సన్మానం.. గెస్ట్‌గా అమీర్ ఖాన్??

ఆర్ఆర్ఆర్ సినిమాని హిందీలో పెన్ స్టూడియోస్ సంస్థ రిలీజ్ చేసింది. అక్కడ కూడా ఈ సినిమాకి బాగా లాభాలు వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికే నార్త్ లో ఈ సినిమా 200 కోట్లకు పైగా గ్రాస్...

RRR : ముంబైలో చరణ్, తారక్‌లకు సన్మానం.. గెస్ట్‌గా అమీర్ ఖాన్??

Rrr

RRR :  చరణ్, తారక్ ల కాంబినేషన్లో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా బాక్సాఫీస్ ని కలెక్షన్లతో ముంచెత్తుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశంలోని అన్ని ప్రాంతాల్లో, విదేశాల్లో కూడా ఈ సినిమా కలెక్షన్లలో సరికొత్త రికార్డులని సృష్టిస్తుంది. ఇటీవలే ఈ సినిమా నైజాం ఏరియాలో 200 కోట్ల గ్రాస్, 100 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసి రికార్డు సృష్టించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఈ సినిమాని నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చిత్ర యూనిట్ కి గ్రాండ్ పార్టీ ఇచ్చారు. తన ఆధ్వర్యంలో ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.

ఇక ఆర్ఆర్ఆర్ సినిమాని హిందీలో పెన్ స్టూడియోస్ సంస్థ రిలీజ్ చేసింది. అక్కడ కూడా ఈ సినిమాకి బాగా లాభాలు వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికే నార్త్ లో ఈ సినిమా 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. దీంతో పెన్ స్టూడియోస్ సంస్థ కూడా ముంబైలో గ్రాండ్ సక్సెస్ సెలెబ్రేషన్స్ ప్లాన్ చేయాలని చూస్తుంది. ఈ పార్టీకి ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర యూనిట్ తో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరవనున్నారు.

Nani : కొత్త యాడ్ కోసం పంచెకట్టుతో సరికొత్త రూపంలో నాని

అయితే ముంబైలో జరగనున్న ఈ పార్టీలో ఎన్టీఆర్, చరణ్ లకు సన్మానం కూడా నిర్వహించాలని పెన్ స్టూడియోస్ సంస్థ భావిస్తుంది. ఈ సన్మానాన్ని బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తో చేయించాలని అనుకుంటున్నారట. మరి ఈ పార్టీ ఏ రేంజ్ లో నిర్వహిస్తారో, దీనికి ఇంకా ఎవరెవరు బాలీవుడ్ ప్రముఖులు వస్తారో చూడాలి. మొత్తానికి మరోసారి మన టాలీవుడ్ సినిమా, తెలుగు హీరోలు బాలీవుడ్ లో జెండా ఎగరేస్తున్నారు.