Rajasthan : ప్రభుత్వ కార్యాలయంలో రూ.2 వేల నోట్ల గుట్టలు, బంగారం కడ్డీలు .. అధికారులు షాక్

రూ.2వేల నోటు నిషేధిస్తున్నామని ఆర్బీఐ ప్రకటించటంతో దేశంలో మరోసారి కలకలం మొదలైంది. రెండు వేల రూపాయల నోట్లను ఎలా వదిలించుకోవాలో అని పరుగులు పెడుతున్నారు జనాలు. ఈక్రమంలో ఓ ప్రభుత్వ కార్యాలయంలో రెండువేల నోట్ల గుట్టలు బయటపడ్డాయి. బంగారం కడ్డీలు కూడా బయటపడ్డాయి.

Rajasthan :  ప్రభుత్వ కార్యాలయంలో రూ.2 వేల నోట్ల గుట్టలు, బంగారం కడ్డీలు .. అధికారులు షాక్

Jaipur Govt office Rs 2 crore, 1kg gold

Jaipur Govt office Rs 2 crore, 1kg gold : రూ.2వేల నోటు నిషేధిస్తున్నామని ఆర్బీఐ ప్రకటించటంతో దేశంలో మరోసారి కలకలం మొదలైంది. తమ వద్ద ఉండే ఆ నోట్లు ఎలా వదిలించుకోవాలి..తిరిగి ఎలా క్యాష్ చేసుకోవాలా? అనే ఆందోళన పడుతున్నారు జనాలు. గతంలో పెద్దనోట్లు రద్దు సమయంలో పలు ప్రాంతాల్లో రద్దు అయిన నోట్లు కుప్పలు కుప్పలుగా పారేసిన సందర్భాలు ఎన్నో ఎన్నెన్నో..తాజా రూ.2వేల నోటు నిషేధిస్తున్నామని ఆర్బీఐ ప్రకటనతో రాజస్థాన్‌లోని జైపూర్‌లో అటువంటి ఘటనే కనిపించింది.

ఒక ప్రభుత్వ కార్యాలయంలో భారీగా రెండు వేల రూపాయల నోట్లు భారీగా లభ్యమయ్యాయి. అంతేకాదు బంగారు కడ్డీలు కూడా లభ్యమయ్యాయి. ఒక ప్రభుత్వ కార్యాలయంలో దాడులు జరిపిన పోలీసులకు కళ్లు చెదిరిపోయేలా బంగారం, కోట్లలో నగదు కనిపించింది. ఇక్కగ మరో విషయం ఏమిటంటే నగదులో కేవలం 2వేలు, 500 నోట్లు ఉన్నాయి.

రాజస్థాన్‌లోని జైపూర్‌లోని ప్రభుత్వ కార్యాలయంలో క్లైయిమ్ చేయని రూ.2.31 కోట్లు, బంగారు బిస్కెట్లు కనిపించటంతో అధికారులు షాక్ అయ్యారు. వాటిని స్వాధీనం చేసుకుని సీజ్‌ చేసారు. ప్రభుత్వ కార్యాలయంలో రూ.2.31 కోట్లు, కిలో బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నామని రాజస్థాన్ చీఫ్ సెక్రటరీ ఉషాశర్మ, పోలీస్ కమీషనర్ ఆనంద్ కుమార్ శ్రీ వాస్తవ, ఐటీ అదనపు శాఖ డైరెక్టర్ తెలిపారు. అలాగే డిపార్ట్ మెంట్ కు చెందిన ఎనిమిదిమందిని విచారణ కోసం అదుపులోకి తీసుకున్ారు.

శుక్రవారం రాత్రి పోలీసు అధికారులు దాడిచేశారు. కార్యాలయంలోని ఓ గదిలో ఉన్న కబ్‌బోర్డులో బ్యాగును గుర్తించారు. తెరచిచూస్తే షాక్ అయ్యారు. బ్యాగు నిండా నోట్లకట్టలతోపాటు బంగారు బిస్కెట్లు కూడా ఉన్నాయి. జైపూర్‌లోని ఐటీ శాఖకు చెందిన యోజనా భవన్‌లో లెక్కల్లోకిరాని డబ్బును అధికారులు గుర్తించారు. పక్కా సమాచారంతో శుక్రవారం రాత్రి యోజనా భవన్‌పై పోలీసులు దాడిచేశారు. ఈ సందర్భంగా ఓ బ్యాగ్‌లో రూ.2.31 కోట్ల నగదు, కిలో బరువున్న బంగారు బిస్కెట్లను గుర్తించారు. ఆ మొత్తాన్ని సీజ్‌చేసి ఆదాయపుపన్ను శాఖ అధికారులకు అందజేశారు.దీనిపై నగదు కనిపించిన కార్యాలయంలోని సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నామని..ఈ విషయాన్ని సీఎం అశోక్ గెహ్లాట్ కు సమాచారం అందించామని పోలీస్ కమీషనర్ ఆనంద్ కుమార్ శ్రీ వాస్తవ తెలిపారు.