Walkers OU : ఓయూలో వాకర్లకు రూ. 200 యూజర్ ఛార్జీలు, ఎందుకో తెలుసా ?

యూనివర్సిటీ అధికారులు క్యాంపస్ లోకి ప్రవేశించే వారికి గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. వాకింగ్ చేసే వారిలో ప్రముఖులు కూడా ఉంటారు.

Walkers OU : ఓయూలో వాకర్లకు రూ. 200 యూజర్ ఛార్జీలు, ఎందుకో తెలుసా ?

Ou Walk

Walkers In OU Campus : విద్యాసంస్థల్లో ఓయూకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక్కడ చదివి..ఉన్నతస్థానాల్లో ఉన్న వారు చాలామందే ఉన్నారు. హైదరాబాద్ లో ఉన్న ఓయూకు చాలా స్థలాలే ఉన్నాయి. చుట్టూ చెట్లతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంటుంది. దేశ, విదేశాల నుంచి ఇక్కడకు వచ్చి చదువుకుంటుంటారు. చెట్ల కింద సేద తీరుతూ..కొందరు కాలక్షేపం చేస్తుంటారు. మరికొందరు పుస్తకాలతో కుస్తీలు పడుతుంటారు. ఇక ఉదయం సమయంలో..చాలా మంది మార్నింగ్ వాక్ చేస్తుంటారు. వాకర్స్ కు బిగ్ షాక్ ఇచ్చింది యూనివర్సిటీ. డిసెంబర్ నెల నుంచి యూనివర్సిటీ గ్రౌండ్ లో వాకింగ్ చేసే వారి నుంచి రూ. 200 యూజర్ ఛార్జీలను వసూలు చేయాలని అధికారులు నిర్ణయించడం చర్చనీయాంశమైంది. స్విమ్మింగ్ పూల్, క్రికెట్ గ్రౌండ్ వాడుకొనే వారి నుంచి యూజర్ ఛార్జీలు వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Read More : India Petrol : 25 రోజుల నుంచి పెరగని పెట్రో ధరలు, ఏ నగరంలో ఎంతంటే

వాకర్లకు యూజర్ ఛార్జీలను వసూలు చేయడానికి గల కారణం కూడా చెబుతున్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన వందలాది మంది ఇక్కడ క్యాంపస్ లో తిరుగుతుంటారని, అయితే..ఎవరు ఎందుకు వస్తున్నారో తెలియడం లేదని…అందుకోసం యూనివర్సిటీ అధికారులు క్యాంపస్ లోకి ప్రవేశించే వారికి గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. వాకింగ్ చేసే వారిలో ప్రముఖులు కూడా ఉంటారు. సమీపంలో నివాసం ఉండే వారంతా..ఇక్కడకు వచ్చి వాకింగ్..ఇతర ఎక్సర్ సైజ్ లు చేసి వెళుతుంటారు. వీరితో పాటు వ్యక్తిగత భద్రతా సిబ్బంది వస్తుంటారు. ఎవరు వస్తున్నారో తెలియకపోవడంతో..వీరి భద్రత గురించి ఆలోచించి ఉంటారని అనుకుంటున్నారు.

Read More : US : నేరం చేయలేదు..కానీ 43 ఏళ్ల జైలు శిక్ష, ఆదుకోవడానికి రూ. 10 కోట్ల విరాళం

ఓయూ యూనివర్సిటీ అధికారులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తున్నారు. బయటి వ్యక్తులు క్యాంపస్ లోని వసతులును ఉచితంగా వాడుకోవడం వల్ల…వాటి విలువ తెలియడం లేదని కొందరు విద్యార్థులు వెల్లడిస్తున్నారు. రాత్రి వేళ మద్యం బాబులు ఇక్కడకు వచ్చి…ఖాళీ సీసాలను పగులగొట్టి అక్కడే వదిలేస్తున్నారంటున్నారు. మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకేనని వీసీ వెల్లడిస్తున్నారు.