US : నేరం చేయలేదు..కానీ 43 ఏళ్ల జైలు శిక్ష, ఆదుకోవడానికి రూ. 10 కోట్ల విరాళం

కాల్పులు జరిపిన వారిలో కెవిన్ కూడా ఉన్నాడని ఆమె పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ..తాను పొరబడినట్లు సింతియా గ్రహించారు. కానీ...

US : నేరం చేయలేదు..కానీ 43 ఏళ్ల జైలు శిక్ష, ఆదుకోవడానికి రూ. 10 కోట్ల విరాళం

Us Man

43 Years In Prison : నేరం చేయలేదు..కానీ..ఏం చేయాలో అర్థం కాలేదు. అతనే నేరం చేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్టు చేశారు. కానీ..అతను నేరం చేయలేదని ఆ మహిళ తెలుసుకుంది. కానీ…తప్పు చేసినట్లు ఒప్పుకొంటే శిక్ష విధిస్తుందోమోనన్న భయపడిపోయింది. ఫలితంగా అతడికి ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 43 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు. కాలం గడిచిపోతోంది..దశబ్దాలు గడిచిపోయాయి. అరెస్టు అయ్యింది…18 ఏళ్ల వయస్సులో. చివరకు 62 ఏళ్ల వయస్సున్నప్పుడు…నిర్ధోషి అంటూ…కోర్టు తీర్పు చెప్పడంతో ఆయన నిర్దోషిగా విడుదలయ్యారు. ఈ ఘటన చాలా మందిని కలిచివేసింది. అతడిని ఆదుకొనేందుకు చాలా మందుకు వచ్చారు. ఏకంగా రూ. 10 కోట్ల విరాళాలు వచ్చి చేరాయి. ఈ ఘటన వాషింగ్టన్ లో చోటు చేసుకుంది.

Read More : Czech President: జెక్ ప్రెసిడెంట్‌కు కొవిడ్ పాజిటివ్.. బాక్సులో ఉండి కొత్త ప్రధాని ఎంపిక

కెవిన్ స్ట్రిక్ లాండ్ అనే వ్యక్తి…అమెరికాలోని మిసోరిలో నివాసం ఉంటున్నాడు. 1978 సంవత్సరం, ఏప్రిల్ 25వ తేదీన కాన్సాస్ నగరంలోని ఓ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేశారు. ఇంట్లో ఉన్న ముగ్గురిని కాల్చి చంపారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. దాడిలో సింతియా డగ్లస్ మహిళ తప్పించుకుంది. కాల్పులు జరిపిన వారిలో కెవిన్ కూడా ఉన్నాడని ఆమె పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ..తాను పొరబడినట్లు సింతియా గ్రహించారు. కానీ…తప్పు ఒప్పుకుంటే.. కోర్టు తనకు శిక్ష విధిస్తుందేమోనన్న భయంతో ఆమె పెదవి విప్పలేదు.

Read More : Dollor Seshadri: పి.శేషాద్రి.. డాలర్ శేషాద్రిగా ఎలా మారారు.. 43ఏళ్లుగా శ్రీవారి సేవలో..

ఆమె ఇచ్చిన సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు..కెవిన్ కు 50 ఏళ్ల పాటు శిక్షను ఖరారు చేస్తూ..తీర్పును వెలువరించింది. ఈ ఏడాది ఆగస్టులో కెవిన్ శిక్షను సవాల్ చేస్తూ..స్థానిక ప్రాసిక్యూటర్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణలో కెవిన్ నిర్దోషి అని కోర్టు తేల్చింది. చివరకు..కోర్టుకు సంబంధించిన పనులు పూర్తయిన తర్వాత…2021, నవంబర్ 23వ తేదీన కెవిన్ జైలు నుంచి విడుదలయ్యారు. కానీ..అతని ఆరోగ్యం పూర్తిగా పాడైంది. దీంతో ఇతడిని ఆదుకోవడానికి ‘గో ఫండ్ మీ’ సంస్థ రూ. 10 కోట్లు విరాళంగా సేకరించింది.