Hyderabad Cyber Fraud : రూ. 2200 కోట్ల చీటింగ్, ఒకరు అరెస్టు

చైనీలకు నిధులకు మళ్లించిన ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 13 షెల్ కంపెనీల ద్వారా నిధులు మళ్లించినట్లు తేలింది. ఒకే ఇంటి అడ్రస్ తో ఐదు కంపెనీలు ఏర్పాటు...

Hyderabad Cyber Fraud : రూ. 2200 కోట్ల చీటింగ్, ఒకరు అరెస్టు

Cyber Fraudsters

Rs 2200-Crore Fraud : హైదరాబాద్‌లో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్ గేమింగ్, పెట్టుబడుల పేరుతో కేటుగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. ఏకంగా 2 వేల 200 కోట్ల రూపాయలకు పైగా మోసం జరిగినట్టుగా రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్-ఆర్వోసీ గుర్తించింది. పలు బోగస్ కంపెనీలపై హైదరాబాద్‌ సీసీఎస్‌లో ఫిర్యాదు చేసింది. నకిలీ ధ్రువ పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో బోగస్ కంపెనీల నిర్వహించినట్టుగా ఆర్వోసీ తెలిపింది. బోగస్ కంపెనీల డైరెక్టర్లు, చైర్మన్లు, ప్రమోటర్లపై ఫిర్యాదు చేయడంతో పాటుగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఇక కేటుగాళ్లు ఆన్‌లైన్ గేమ్స్, పెట్టుబడుల యాప్‌ల పేరుతో నగదు తరలించినట్టుగా తెలుస్తోంది. బోగస్ కంపెనీలు 2వేల కోట్ల రూపాయలకు పైగా తరలించినట్టుగా సమాచారం. డబ్బులను హాంకాంగ్‌ తరలించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

Read More : vijayawada Minor Girl : వినోద్‌‌ను కఠినంగా శిక్షించాలి – వాసిరెడ్డి పద్మ

తాజాగా ఈ కేసులో పురోగతి సాధించారు. చైనీలకు నిధులకు మళ్లించిన ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 13 షెల్ కంపెనీల ద్వారా నిధులు మళ్లించినట్లు తేలింది. ఒకే ఇంటి అడ్రస్ తో ఐదు కంపెనీలు ఏర్పాటు చేసినట్లు, సికింద్రాబాద్ లో ఒకే చిరునామాతో ఈ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. మరో 8 కంపెనీల సమాచారం సేకరిస్తున్నారు. లోన్ అప్ కేసులో నిందితుడిగా ఉన్న లాంబోపై ప్రధాన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మాల్ 008, మాల్ 98, YS0123, మాల్ రిబేట్ పేర్లతో చైనీయులు ఈ మోసాలకు పాల్పడినట్టుగా సమాచారం. ఈ వ్యవహారంలో ఇద్దరు చైనీయులు కీలకపాత్ర పోషించినట్టుగా పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే చైనీయులకు బోగస్ కంపెనీలు సమకూర్చిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. హవాలా మార్గంలో ఈ డబ్బును తరలించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.