75 Rupees coin: రూ.75 నాణెం కావాలంటే ఎలా?

పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవ సందర్భంలో రూ.75 నాణేన్ని కేంద్రం విడుదల చేస్తోంది. అయితే ఈ నాణెం ప్రత్యేకత ఏంటి? ఎలా తయారు చేస్తారు? దీనిని పొందాలంటే ఎలా అనే అనుమానాలు అందరిలోనూ ఉంటాయి. కేవలం సేకరణకు మాత్రమే ఉపయోగపడే ఈ నాణెం ఎక్కడ అందుబాటులో ఉంటుందంటే?

75 Rupees coin: రూ.75 నాణెం కావాలంటే ఎలా?

75 Rupees coin special

75 Rupees coin special : పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవం రోజున కేంద్రం రూ.75 రూపాయల స్మారక నాణేన్ని విడుదల చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నాణేన్ని పొందాలంటే ఎలా?

India Rs.75 Coin : నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా.. రూ.75 కాయిన్ ను విడుదల చేయనున్న కేంద్రం

ఈ నెల 28 న ప్రధాని మోదీ పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం రూ.75 ల నాణేన్ని విడుదల చేస్తోంది. గతంలో కూడా కొన్ని సందర్భాల్లో ప్రత్యేక నాణాలు రూపొందించారు. అయితే ఈసారి విడుదల చేయబోతున్న నాణేనికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి.

ఈసారి విడుదల చేస్తున్న రూ. 75 నాణెంపై పార్లమెంట్ నూతన భవనం చిత్రం ఉంది. దానికి పై భాగాన ‘సన్ సద్ సానుకూల్’ అని దేవనాగరి లిపిలో .. కింద ‘పార్లమెంట్ కాంప్లెట్స్’ అని ఇంగ్లీషులో ముద్రించారు. 44 మిల్లీ మీటర్ల వ్యాసంలో వృత్తాకారంలో ఉన్న ఈ నాణేనికి చివర 200 వంకీలు ఉన్నాయి. 35 గ్రాముల బరువున్న ఈ నాణేన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్ కలిపిన మిశ్రమంతో తయారు చేసారట. పార్లమెంట్ కాంప్లెక్స్ కింద భాగంలో 2023 అని రాసి ఉంది. నాణేనికి రెండో వైపు భారత్ అని దేవనాగరి లిపిలోనూ, ఇంగ్లీష్‌లో ఇండియా అని రాసి ఉంటుంది.

Assam: ఆరేళ్లుగా జమచేసుకున్న రూ.1, రూ.2, రూ.5 కాయిన్స్ తీసుకెళ్లి.. స్కూటీ కొని అంబరాన్నంటే ఆనందం వ్యక్తంచేసిన యువకుడు

అయితే ఈ నాణేలు చలామణి కోసం ప్రారంభిస్తున్నవి కాదు. కేవలం వీటిని సేకరించడానికి మాత్రమే వినియోగిస్తారు. ఇవి ముంబయి, కోల్‌కతా, హైదరాబాద్, నోయిడాలోని ముద్రణాలయాల్లో రూపొందిస్తారు. వీటి తయారు ఖర్చు చాలా ఎక్కువగా ఉండటంతో తక్కువ సంఖ్యలో ముద్రిస్తారు. అయితే వీటిని కొనాలంటే  నేరుగా ముద్రించే ప్రాంతాలకు వెళ్లనవసరం లేదు. కొన్ని ఏజెన్సీల ద్వారా వీటిని కొనవచ్చు. లేదంటే kolkata Mint, Mumbai Mint, Hyderabad Mint అధికారిక వెబ్ సైట్లలో కొనుగోలు చేసుకోవచ్చును. అయితే ఎక్కువగా వీటిని నాణేలు సేకరించేవారు మాత్రమే కొంటూ ఉంటారు.