RTC MD Sajjanar : అయ్యయ్యో వద్దన్నా.. సుఖీభవ సుఖీభవ.. సజ్జనార్ ట్వీట్ వైరల్

సజ్జనార్ తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి తనదైన శైలిలో పనులు చేస్తున్నారు. ప్రయాణికులను ఆర్టీసీవైపు ఆకర్షించేలా చర్యలు తీసుకుంటున్నారు.

RTC MD Sajjanar : అయ్యయ్యో వద్దన్నా.. సుఖీభవ సుఖీభవ.. సజ్జనార్ ట్వీట్ వైరల్

Rtc Md Sajjanar

RTC MD Sajjanar : సజ్జనార్ తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి తనదైన శైలిలో పనులు చేస్తున్నారు. ప్రయాణికులను ఆర్టీసీవైపు ఆకర్షించేలా చర్యలు తీసుకుంటున్నారు. బస్సులో సామాన్య ప్రయాణికునిలా ప్రయాణించి.. ప్రయాణికుల సమస్యలు తెలుసుకుంటున్నారు. సంస్థను ఆర్ధికంగా బలపరిచేందుకు అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి సరికొత్త విధానాలకు రూపకల్పన చేస్తున్నారు సజ్జనార్. ఇక ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ ప్రయాణంపై ప్రజల్లో భరోసా కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా గణేష్ నిమజ్జనానికి ఆయన కుటుంబంతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి అందరి దృష్టిని ఆకర్షించారు.

చదవండి : TS RTC Special Buses : దసరా పండగ బస్సులకు టీ.ఎస్.ఆర్టీసీ ప్రత్యేక పాయింట్లు

ఇక ఇదిలా ఉంటే పండుగ సమయంలో ప్రయాణికులు ఆర్టీసీ బస్సులు ఎక్కేలా మోటివేట్ చేస్తున్నారు. ఆర్టీసీ ప్రయాణం సురక్షితం అని రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక దసరా పండుగ కావడంతో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి సామాన్య ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా చూస్తున్నారు. ప్రయాణికుల్లో గందరగోళం ఏర్పడకుండా బస్సులు ఏఏ ప్రాంతాల గుండా వెళ్తుందో వివరంగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదివారం ప్రకటన చేశారు. ప్రయాణికుల సౌకర్యం, భద్రతే ధ్యేయంగా పండుగ సమయంలో ఎటువంటి అదనపు చార్జీలు లేకుండా ఆర్టీసీ సేవలందిస్తుందని పేర్కొన్నారు.

చదవండి : TSRTC : దసరా పండగకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

ప్రయాణికులను ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా చేసేందుకు సజ్జనార్ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. ‘అయ్యయ్యో వద్దమ్మా సుఖీభవ సుఖీభవ’ అంటూ ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అయిన డైలాగ్‌తో ప్రయాణికులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సజ్జనార్ ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

చదవండి : TSRTC: సజ్జనార్ మార్క్.. ఆర్టీసీ ఉద్యోగులకు ఎక్స్‌ట్రార్డినరీ లీవ్!

ఈ వీడియోలో ఓ వ్యక్తి సూటుకేసు తీసుకోని ఊరు వెళ్లేందుకు బయలుదేరుతాడు. అతడు రోడ్డు మీద ఉన్న వ్యక్తితో తాను జీప్‌లో ఊరికి వెళ్తున్నట్టుగా చెప్తాడు. అప్పుడు వెంటనే అక్కడున్న ఓ గ్యాంగ్ ‘పక్కనే ఆర్టీసీ బస్సు ఉంది క్షేమంగా వెళ్లొచ్చు డబ్బులు ఎక్కువ తీసుకోరు గానీ సుఖీభవ, సుఖీభవ’అని అంటాడు. ఆ తర్వాత డ్యాన్స్‌ చేయడం మొదలుపెడతారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన సజ్జనార్ ‘అయ్యయ్యో వద్దమ్మా కానీ.. సుఖీభ‌వ‌ సుఖీభ‌వ‌ నమ్మకానికి భరోసా మన టీఎస్ ఆర్టీసీ.. RTC బస్సులలో ప్రయాణం సురక్షితం, సుఖమయం, మరియు శుభప్రదం’అని పేర్కొన్నారు. సజ్జనార్ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.