TS RTC Special Buses : దసరా పండగ బస్సులకు టీ.ఎస్.ఆర్టీసీ ప్రత్యేక పాయింట్లు

దసరా పండగ సందర్భంగా సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికుల కోసం టీ.ఎస్.ఆర్టీసీ జంట నగరాల్లోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక పాయింట్ల ద్వారా బస్సులను నడపనున్నట్లు అధికారులు తెలిపారు.

TS RTC Special Buses : దసరా పండగ బస్సులకు టీ.ఎస్.ఆర్టీసీ ప్రత్యేక పాయింట్లు

Mgbs Hyderrabad

TS RTC Special Buses :  దసరా పండగ సందర్భంగా సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికుల కోసం టీ.ఎస్.ఆర్టీసీ జంట నగరాల్లోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక పాయింట్ల ద్వారా బస్సులను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. మరో వైపు ఎంజీబీఎస్‌కు వచ్చే ప్రయాణికుల కోసం బస్సుల వివరాలతో పాటు ఏఏ ఫ్లాట్‌ ఫారంల నుంచి ఏ బస్సు బయలు దేరుతున్నదనే సమాచారాన్ని తెలిపేందుకు గాను నాలుగు వైపులా మే ఐ హెల్ప్‌ యూ కౌంటర్లను ఏర్పాటు చేసింది.

నేటి నుంచి రూట్లలో తాత్కాలిక మార్పులు

సీబీఎస్‌ నుంచి కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు వైపు షెడ్యూలు, స్పెషల్‌ బస్సులు నడపనున్నారు
జూబ్లీబస్‌స్టేషన్‌ నుంచి కరీంనగర్‌,నిజామాబాద్‌,ఆదిలాబాద్‌,మెదక్‌ జిల్లాల వైపు షెడ్యూలు,స్పెషల్‌ బస్సులు
ఉప్పల్‌ క్రాస్‌ రోడ్‌ నుంచి వరంగల్‌ వైపు వెళ్లే షెడ్యూలు,స్పెషల్‌ బస్సులు
దిల్‌సుఖ్‌నగర్‌ బస్‌స్టేషన్‌ నుంచి మిర్యాలగూడ,నల్గొండ,కోదాడ,సూర్యాపేట వైపు షెడ్యూలు,స్పెషల్‌ బస్సులు.
ఎంజీబీఎస్‌ నుంచి విజయవాడ,విశాఖ పట్నం, ఈస్ట్‌ గోదావరి,వెస్ట్‌ గోదావరి, గుంటూరు, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, శ్రీశైలం, నాగర్‌ కర్నూలు, వనపర్తి, పరిగి, వికారాబాద్‌, తాండూరు, మెదక్‌, జహీరాబాద్‌ వైపు వెళ్లే షెడ్యూలు,స్పెషల్‌ బస్సులు నడపనున్నారు.

స్పెషల్‌ బస్సుల ప్లాట్‌ఫారాలు
ఎంజీబీఎస్‌ ఫ్లాట్‌ ఫారం 41,42 నుంచి పెబ్బేర్‌,కొత్తకోట,గద్వాల్‌కు..
ఎంజీబీఎస్‌ ఫ్లాట్‌ ఫారం 14,15 నుంచి సూర్యాపేట,కోదాడకు..

సిటీ బస్సుల ఫ్లాట్‌ఫారాలు
దిల్‌సుఖ్‌నగర్‌,ఎల్‌బీనగర్‌కు ఫ్లాట్‌ ఫారం 14,15 నుంచి..
ఉప్పల్‌ క్రాస్‌ రోడ్డుకు 18,19 ఫ్లాట్‌ ఫారం నుంచి..
జేబీఎస్‌కు 53,55 ఫ్లాట్‌ ఫారం నుంచి..

ఇదిలా ఉండగా కాలనీల్లోని 20 మంది కంటే ఎక్కువ ప్రయాణికులు ఉంటే స్థానిక డిపో మేనేజర్‌కు సమాచారం అందిస్తే వారి ఇంటి వద్దకే బస్సును పంపిస్తామన్నారు.అన్ని పాయింట్ల వద్ద ఆర్‌ఎం స్థాయి నుంచి డీవీఎం,డిపో మేనేజర్లు అందుబాటులో ఉండి ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకొంటారు. ప్రయాణికులు టికెట్‌ బుక్‌ చేసుకోవడానికి ఆన్‌లైన్‌లో www.tsrtconline. in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని కోరారు.

దసరా పండగ సందర్భంగా సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ లోని జిల్లాలతో పాటు అంతరాష్ట్ర బస్సుల్లో కూడా అదనపు చార్జీలు వసూలు చేయటం లేదని రంగారెడ్డి రీజియన్ జనరల్‌ మేనేజర్‌ బీ. వరప్రసాద్‌ తెలిపారు.  ఈనెల 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు ఇతర రాష్ర్టాలకు అదనపు బస్సులను నడపడానికి ప్రత్యేక ప్రణాళికను రూపొందించామని తెలిపారు. అందులో భాగంగా ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ఏడాది 4035 అదనపు బస్సులను నడుపుతున్నట్లు చెప్పారు.