TS EAMCET Results 2023: తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో అనిరుధ్‌కు ఫస్ట్ ర్యాంక్

ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షలను 1,95,275, అగ్రికల్చర్‌ పరీక్షలను 1,06,514 మంది విద్యార్థులు రాశారు.

TS EAMCET Results 2023: తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో అనిరుధ్‌కు ఫస్ట్ ర్యాంక్

Sabitha Indra Reddy

Telangana: తెలంగాణ ఎంసెట్‌ (EAMCET) ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) విడుదల చేశారు. eamcet.tsche.ac.inలో ఫలితాలు చూసుకోవచ్చు. పరీక్షలు సజావుగా జరిగి, ఫలితాలు త్వరగా వెల్లడి కావడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నట్లు సబిత తెలిపారు.

అగ్రికల్చర్ విభాగంలో 86 శాతం మంది అర్హత సాధించారని సబిత వివరించారు. ఇంజనీరింగ్ విభాగంలో 80 శాతం మంది అర్హత సాధించారని చెప్పారు. MISSION BHAGIRATHA పాస్ వర్డ్ తో ఫలితాలు చూసుకోవచ్చు. ఎంసెట్ లోనూ బాలికలదే పైచేయి.

ఇంజనీరింగ్ విభాగంలో బాలికల ఉత్తీర్ణత శాతం 82గా నమోదు కాగా, బాలుర ఉత్తీర్ణత శాతం 79గా నమోదైంది. అగ్నికల్చర్ విభాగంలో బాలికల ఉత్తీర్ణత శాతం 87గా నమోదు కాగా, బాలుర ఉత్తీర్ణత శాతం 84గా నమోదైంది.

ఇంజనీరింగ్ విభాగంలో అనిరుధ్ అనే విశాఖ విద్యార్థి ప్రథమ ర్యాంకు సాధించారు. గుంటూరుకు చెందిన యాకంటిపల్లి మణిందర్ రెడ్డి ద్వితీయ ర్యాంకు, నందిగామకు చెందిన ఉమేశ్ వరుణ్ తృతీయ ర్యాంకులో నిలిచారు. హైదరాబాద్ విద్యార్థి అభినీత్ నాలుగో ర్యాంకు, తాడిపత్రికి చెందిన ప్రమోద్ కుమార్ అయిదవ ర్యాంకు సాధించారు.

అగ్రికల్చర్ విభాగంలో బూరుగుపల్లి సత్య ప్రథమ ర్యాంకు, చీరాల విద్యార్థి ఎన్. వెంకట్ ద్వితీయ ర్యాంకు, హైదరాబాద్ కు చెందిన ఎస్.లక్ష్మి తృతీయ ర్యాంకు, తెనాలికి చెందిన డి.కార్తికేయరెడ్డి నాలుగో ర్యాంకు, శ్రీకాకుళం విద్యార్థి వరుణ్ చక్రవర్తికి అయిదవ ర్యాంకు దక్కింది.

అడ్మిషన్ల ప్రక్రియ వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. చాలా జాగ్రత్తగా తీసుకుని పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ఈసారి ఆన్ టైం లో ఫలితాలు విడుదల చేశామని చెప్పారు. 21 జోన్లలో పరీక్షలు నిర్వహించామని అన్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు.

మే 10 నుంచి 14 వరకు ఎంసెట్‌ నిర్వహించారు. ఎంసెట్ కు దాదాపు 3 లక్షలకుపైగా విద్యార్థులు హాజరయ్యారు. ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షలను 1,95,275, అగ్రికల్చర్‌ పరీక్షలను 1,06,514 మంది విద్యార్థులు రాశారు.

ఫలితాలను కేవలం 10 రోజుల్లోనే విడుదల చేశారు. కరోనా కారణంగా గత మూడు-నాలుగేళ్లుగా ఎంసెట్‌ ప్రక్రియలో జాప్యం జరిగిన విషయం తెలిసిందే. ఈ సారి మాత్రం త్వరగా ఫలితాలు విడుదల కావడంతో వచ్చేనెలలోనే అడ్మిషన్‌లకు కౌన్సెలింగ్‌ ప్రారంభించే అవకాశం ఉంది. జూలైలోపు ఎంసెట్ మూడు దశల కౌన్సెలింగ్‌ పూర్తి కావచ్చు. ఈ ఏడాది ఆగస్టు 1నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి.

Health Benefits of Milk : పాలు అన్ని వయసుల వారికి ఒక అద్భుతమైన పానీయమా?