Sachin Pilot : త్వరలో రాజస్థాన్ కేబినెట్ విస్తరణ.. గెహ్లాట్ మంత్రివర్గంలోకి పైల‌ట్‌..!

రాజస్థాన్ కేబినెట్ విస్తరణకు ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం అనుమతించినట్టు తెలుస్తోంది. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ త‌న కేబినెట్ త్వరలో విస్తరించేందుకు సన్నద్ధమవుతోంది.

Sachin Pilot : త్వరలో రాజస్థాన్ కేబినెట్ విస్తరణ.. గెహ్లాట్ మంత్రివర్గంలోకి పైల‌ట్‌..!

Sachin Pilot To Make A Smooth Landing In New Rajasthan Cabinet; Gehlot Goes On Backfoot

New Rajasthan Cabinet : రాజస్థాన్ కేబినెట్ విస్తరణకు ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం అనుమతించినట్టు తెలుస్తోంది. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ త‌న కేబినెట్ త్వరలో విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఈ కేబినెట్ విస్త‌ర‌ణ‌తో గత ఏడాదిలో అశోక్ గెహ్లాట్‌పై తిరుగుబాటు ప్ర‌క‌టించిన స‌చిన్ పైల‌ట్‌కు ముందుగా ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. త్వ‌ర‌లో జ‌రిగే మంత్రివర్గ విస్త‌ర‌ణ‌లో క‌నీసం న‌లుగురు పైల‌ట్ వ‌ర్గ ఎమ్మెల్యేల‌కు చోటు ద‌క్కుతుంద‌ని సమాచారం. స‌చిన్ పైల‌ట్ తిరుగుబాటు త‌ర్వాత కాంగ్రెస్ అధిష్ఠానం అప్ర‌మ‌త్త‌మైంది. ఇరువ‌ర్గాల మ‌ధ్య రాజీ కుద‌ర్చ‌ేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసింది.

ఆగ‌స్టు మొదటివారంలో రాజ‌స్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తో హ‌ర్యానా పీసీసీ అధ్య‌క్షురాలు కుమారి సెల్జా, క‌ర్ణాట‌క పీసీసీ అధ్య‌క్షుడు డీకే శివ‌కుమార్ స‌మావేశ‌మయ్యారు. ఈ సమావేశంలో ప్రత్యేకించి మంత్రివర్గ విస్త‌ర‌ణ‌పై చ‌ర్చించిన‌ట్లు తెలిసింది. కేబినెట్ విస్త‌ర‌ణ‌లో కలిగే ఇబ్బందుల‌ను, సాధ‌క బాధ‌కాల‌పై చ‌ర్చించినట్టు తెలిసింది. అయితే స‌చిన్ పైల‌ట్ వ‌ర్గానికి అధిక ప్రాధాన్యం ఇచ్చేందుకు గెహ్లాట్ సుముఖ‌త వ్య‌క్తం చేశార‌ని తెలుస్తోంది.
US : అప్ఘాన్‌లో అమెరికా మిషన్ కంప్లీట్

ప్ర‌స్తుతం గెహ్లాట్ కేబినెట్‌లో కొంద‌రు స‌భ్యులు తప్పుకోనున్నట్టు సంకేతాలొచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అజ‌య్ మాకెన్‌ ఈ సంకేతాలను ఇచ్చారు. కొంద‌రు మంత్రులు పార్టీ కోసం ప‌ని చేసేందుకు కేబినెట్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు అంగీకరించారని మాకెన్ వెల్లడించారు.

అశోక్ గెహ్లాట్‌ సహా 21 మంది రాజ‌స్థాన్ కేబినెట్‌లో ఉన్నారు. ఈ కేబినెట్‌లో మ‌రో 9 మందికి చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. జిల్లాల స్థాయిలో కూడా పార్టీ ప‌ద‌వులు ఖాళీగా ఉన్నాయని తెలుస్తోంది. గత ఏడాదిలో స‌చిన్ పైల‌ట్ తిరుగుబాటుతో గెహ్లాట్ స‌ర్కార్ ప‌త‌నానికి చేరువైంది. దీన్ని దృష్టిపెట్టుకోనే కాంగ్రెస్ అధిష్ఠానం పైల‌ట్‌, గెహ్లాట్ మ‌ధ్య రాజీ కుదిర్చినట్టు సమాచారం.
VSP : డీసీ పుష్పవర్ధన్‌కు షాక్, ఏసీ శాంతికి అండగా ప్రభుత్వం