Salman Khan : ఆ వ్యాధి వల్ల ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు..
తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ తనకి ఉన్న ఓ అరుదైన వ్యాధి గురించి షేర్ చేసుకున్నాడు. ఇటీవల జరిగిన ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో సల్మాన్ మాట్లాడుతూ......

Salman
Salman Khan : సెలబ్రిటీల జీవితం అందంగా, ఆనందంగా ఉంటుంది అని అందరూ అనుకుంటారు. కొంతమందికి చెప్పుకోలేని అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కొంతమందికి కష్టాలు ఉన్నా బయటకి చెప్పారు. ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడానికి వారికి ఉన్న అన్ని భాదలని తమతోనే దాచుకొని బయటకి నవ్వుతూ కనిపిస్తారు. అయితే కొంతమంది సెలబ్రిటీలు సందర్భం వచ్చినప్పుడు తమకి ఉన్న సమస్యలు బయటకి చెప్తూ ఉంటారు. ఇటీవల పలువురు సెలబ్రిటీలు తమకు ఫలానా ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, వాటితో బాధపడుతున్నామని తెలిపారు.
Ranveer Singh : పుష్పలోని ఆ సాంగ్ అంటే పిచ్చి ఇష్టం.. బాలీవుడ్ స్టార్ హీరో వ్యాఖ్యలు..
తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ తనకి ఉన్న ఓ అరుదైన వ్యాధి గురించి షేర్ చేసుకున్నాడు. ఇటీవల జరిగిన ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో సల్మాన్ మాట్లాడుతూ.. ”నేను ఒకప్పుడు ట్రైజెమినల్ న్యూరాల్జియా అనే తీవ్ర నరాల బలహినతతో బాధపడ్డాను. ఈ వ్యాధి వల్ల ఎక్కువ సేపు మాట్లాడలేను. మాట్లాడితే నా ముఖం అంతా బాగా నొప్పి వచ్చి మూతి కూడా వంకరగా అయ్యేది. బ్రష్ చేసినా, మేకప్ వేసుకున్నా ఈ వ్యాధి వల్ల తీవ్రమైన నొప్పి అనుభవించేవాడిని. రాత్రి సమయంలో ఈ నొప్పి నన్ను పాడుకోనిచ్చేది కాదు. చాలా సార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను, ఆ ఆలోచనలే వచ్చేవి. అయితే దీనికోసం అమెరికాలో చికిత్స తీసుకున్నాను. ప్రస్తుతం ఆ వ్యాధి నుంచి కోలుకున్నాను” అని తెలిపాడు.