salman khan: ‘నీకూ అదే గ‌తి ప‌డుతుంది’.. అంటూ స‌ల్మాన్ న్యాయ‌వాదికి బెదిరింపు లేఖ‌

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ న్యాయవాది హెచ్.సారస్వత్‌ను చంపేస్తామంటూ కొంద‌రు దుండ‌గులు ఓ లేఖ పంపారు. పంజాబీ గాయకుడు, కాంగ్రెస్‌ నేత సిద్ధూ మూసేవాలాకు ప‌ట్టిన గ‌తే సార‌స్వ‌త్‌కు ప‌డుతుందని ఆ లేఖ‌లో హెచ్చ‌రించారు. మూసేవాలా హ‌త్య కేసులో ప్రధాన సూత్రధారి, గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్ ప్రస్తుతం తిహాడ్‌ జైలులో ఉన్న విష‌యం తెలిసిందే.

salman khan: ‘నీకూ అదే గ‌తి ప‌డుతుంది’.. అంటూ స‌ల్మాన్ న్యాయ‌వాదికి బెదిరింపు లేఖ‌
ad

salman khan: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ న్యాయవాది హెచ్.సారస్వత్‌ను చంపేస్తామంటూ కొంద‌రు దుండ‌గులు ఓ లేఖ పంపారు. పంజాబీ గాయకుడు, కాంగ్రెస్‌ నేత సిద్ధూ మూసేవాలాకు ప‌ట్టిన గ‌తే సార‌స్వ‌త్‌కు ప‌డుతుందని ఆ లేఖ‌లో హెచ్చ‌రించారు. మూసేవాలా హ‌త్య కేసులో ప్రధాన సూత్రధారి, గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్ ప్రస్తుతం తిహాడ్‌ జైలులో ఉన్న విష‌యం తెలిసిందే. అత‌డితో పాటు మ‌రో నిందితుడు గోల్డీ బ్రార్ పేర్ల‌ను సూచించేలా ఉన్న అక్ష‌రాలు (ఎల్బీ, జీబీ) లేఖ‌లో కనపడ్డాయి.

Google: అంకుర సంస్థ‌లు ప్రారంభించాల‌నుకుంటోన్న వారికి గూగుల్ గుడ్‌న్యూస్

లారెన్స్‌ బిష్ణోయ్ అనుచరులే ఈ లేఖ పంపిన‌ట్లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో న్యాయవాది హెచ్.సారస్వత్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఆయ‌న‌కు భ‌ద్ర‌త క‌ల్పిస్తున్నామ‌ని పోలీసులు వివ‌రించారు. ఆ లేఖ గురించి విచార‌ణ జ‌రుపుతున్న‌ట్లు చెప్పారు. కాగా, కృష్ణజింకను వేటాడిన కేసులో సల్మాన్‌ ఖాన్ విచార‌ణ ఎదుర్కొన్న విష‌యం తెలిసిందే. అప్ప‌ట్లోనూ సల్మాన్‌ న్యాయవాదికి బెదిరింపులు వ‌చ్చాయి.