Hyderabad: ‘సాలు మోదీ.. సంపకు మోదీ’.. హైదరాబాద్‌లో ఫ్లెక్సీల వార్..

ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గుర్తుతెలియని వ్యక్తులు భారీ ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో మోదీకి వ్యతిరేకంగా ఈ భారీ ప్లెక్సీ వెలిసింది. ఈ ప్లెక్సీలో ‘సాలు మోదీ.. సంపకు మోదీ’ అని రాస్తూనే.. యాస్ ట్యాగ్ పెట్టి బైబై మోదీ అంటూ ముద్రించారు. జీహెచ్ఎంసీ సిబ్బంది గుర్తుతెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ప్లెక్సీలను తొలగించారు. అయితే వ్యవహారం వెనుక టీఆర్ఎస్ నేతల హస్తం ఉందని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

Hyderabad: ‘సాలు మోదీ.. సంపకు మోదీ’.. హైదరాబాద్‌లో ఫ్లెక్సీల వార్..

Modi

Hyderabad: జూలై 2,3 తేదీల్లో హైదరాబాద్ లోని హైటెక్స్ లో బీజేపీ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. 3న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభ జరగనుంది. సభను విజయవంతం చేసే పనిలో బీజేపీ క్యాడర్ నిమగ్నమైంది. బహిరంగ సభ నేపథ్యంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో భారీ ప్లెక్సీలు వెలుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో ప్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గుర్తుతెలియని వ్యక్తులు భారీ ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. సికింద్రాబా పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో మోదీకి వ్యతిరేకంగా ఈ భారీ ప్లెక్సీ వెలిసింది. ఈ ప్లెక్సీలో ‘సాలు మోదీ.. సంపకు మోదీ’ అని రాస్తూనే.. యాస్ ట్యాగ్ పెట్టి బైబై మోదీ అంటూ ముద్రించారు.

TRS Check For BJP : అట్లుంటది కేసీఆర్‌తోని.. బీజేపీకి టీఆర్ఎస్ చెక్.. సిటీలోని హోర్డింగ్స్, మెట్రో పిల్లర్స్ ముందే క్యాప్చర్

నల్లధనం వెనక్కి తెప్పించడం సహా, నోట్ల రద్దు, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలు, రైతు చట్టాలు, అగ్నిపథ్ వంటి అంశాలను ప్లెక్సీలో ముద్రించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లోనూ మోదీకి వ్యతిరేకంగా హోర్డింగ్ లు, ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో పోలీసులను మోహరించారు. బీజేపీ నాయకులు వచ్చి ఆందోళన చేస్తారన్న సమాచారంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. జీహెచ్ఎంసీ సిబ్బంది గుర్తుతెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ప్లెక్సీలను తొలగించారు. అయితే వ్యవహారం వెనుక టీఆర్ఎస్ నేతల హస్తం ఉందని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

Modi’s Visit: మోదీ హైదరాబాద్ పర్యటనకు భారీ భద్రత

గత రెండు రోజులుగా బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మధ్య ఫ్లెక్సీల వార్ నడుస్తోంది. ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనాయకత్వం హైదరాబాద్ లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో కూడిన ప్లెక్సీలను ఆ పార్టీ నాయకులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ నేతల తీరును బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు. ఇటీవల కల్వకుంట్ల కౌంట్ డౌన్ పేరుతో “సాలు దొర సెలవు దొర” అంటూ డిజిటల్ బోర్డును ఏర్పాటు చేయడమే కాకుండా బిజెపి ఏకంగా ఒక వెబ్ సైట్ ను కూడా రూపొందించింది. సీఎం కేసీఆర్ పాలనకు స్వస్తి పలకడానికి వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలని పేర్లు, ఫోన్ నెంబర్లు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం తదితర వివరాలను బీజేపీ సేకరిస్తుంది. అంతేకాదు ఈ వెబ్ సైట్ లో వివరాలు సమర్పించిన వారి రియల్ టైమ్ సంఖ్యను కూడా సూచిస్తుంది. బీజేపీ తీరుపట్ల టీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలో మోదీ హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో కౌంటర్ గా ‘ సాలు మోదీ.. సంపకు మోదీ’ అంటూ టీఆర్ఎస్ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారన్న దానిపై స్పష్టత లేదు.