TRS Check For BJP : అట్లుంటది కేసీఆర్‌తోని.. బీజేపీకి టీఆర్ఎస్ చెక్.. సిటీలోని హోర్డింగ్స్, మెట్రో పిల్లర్స్ ముందే క్యాప్చర్

బీజేపీకి చెక్ పెట్టింది టీఆర్ఎస్. కార్యవర్గ సమావేశాల సందర్భంగా నగరాన్ని కాషాయ మయం చేయాలనుకున్న కమలనాథుల జోష్ కు టీఆర్ఎస్ అడ్డుకట్ట వేసింది.

TRS Check For BJP : అట్లుంటది కేసీఆర్‌తోని.. బీజేపీకి టీఆర్ఎస్ చెక్.. సిటీలోని హోర్డింగ్స్, మెట్రో పిల్లర్స్ ముందే క్యాప్చర్

Trs Check For Bjp (1)

TRS Check For BJP : తెలంగాణలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య ఆసక్తికర పోరు జరుగుతోంది. ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. సభలు, సమావేశాలతో టీఆర్ఎస్ ను ఇరుకునపెట్టేందుకు బీజేపీ చూస్తోంది. మేము కూడా తక్కువ కాదంటూ అధికార పార్టీ ఎత్తులు వేస్తోంది. తాజాగా బీజేపీకి చెక్ పెట్టింది టీఆర్ఎస్. జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా నగరాన్ని కాషాయమయం చేయాలనుకున్న కమలనాథుల జోష్ కు టీఆర్ఎస్ అడ్డుకట్ట వేసింది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

సిటీలోని హోర్డింగ్స్, మెట్రో పిల్లర్స్ అన్నింటిని అధికార పార్టీ ముందే క్యాప్చర్ చేసేసింది. పరేడ్ గ్రౌండ్ లోకి వీవీఐపీలు వెళ్లే గేట్ వద్ద బస్ షెల్టర్స్ కు టీఆర్ఎస్ ఫ్లెక్సీలు కట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా వెళ్లే ప్రధాన గేట్ వద్ద సైతం టీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రచారం కోసం యాడ్ ఏజెన్సీలను సంప్రదించిన బీజేపీ షాక్ అయింది.

ఇప్పటికే టీఆర్ఎస్ బుక్ చేసుకుందంటూ యాడ్ ఏజన్సీల నుంచి సమాధానం వచ్చింది. దీంతో.. పబ్లిసిటీ ఎలా చేయాలనే దానిపై బీజేపీ మల్లగుల్లాలు పడుతోంది. మెట్రో ఎల్ అండ్ టీకి కేంద్ర పెద్దలతో చెప్పించే ప్రయత్నాల్లో కమలనాథులు ఉన్నారు. మెట్రో రైళ్లు, పేపర్ ఏజన్సీలను సంప్రదించినా బీజేపీకి సేమ్ సమాధానం వచ్చింది. ఆర్టీసీ బస్ షెల్టర్స్ పై టీఆర్ఎస్ ఎనిమిదేళ్ల పాలన ఫ్లెక్సీలు వెలిశాయి. జాతీయ కార్యవర్గ సమావేశాలకు టీఆర్ఎస్ కావాలనే అడ్డుతగులుతోందని బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు.

హైదరాబాద్ లో నిర్వహించే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జూలై 2,3 తేదీల్లో హైదరాబాద్ లో సమావేశాలు జరగనున్నాయి. మరోవైపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించబోయే మోదీ బహిరంగ సభపై బీజేపీ ఫోకస్ చేసింది. మోదీ సభకు 10 లక్షల మందిని తరలించేలా ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ మొత్తాన్ని కాషాయమయంగా మార్చేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. ఇప్పటి వరకు బీజేపీ సభ కోసం మొత్తం 16 ట్రైన్లను బుక్ చేసింది బీజేపీ.

Bandi Sanjay: ఎన్నికలు ఉంటేనే కేసీఆర్‌కు పీవీ నరసింహారావు గుర్తుకొస్తారు

బూత్ స్థాయి నుంచి పబ్లిక్ ను తరలించేలా ప్లాన్ చేస్తున్నారు నేతలు. ఒక్కో నియోజకవర్గం నుంచి 10 వేల మందిని సభకు తరలించాలని నియోజకవర్గ కో ఆర్డినేటర్లకు ఆదేశాలు జారీ చేసింది పార్టీ. జూలై 3న జరిగే మోదీ సభపైనే బీజేపీ ఫోకస్ చేసింది. ప్రధాని మోదీ సభతో రాష్ట్రంలో సత్తా చాటుతామని బీజేపీ నేతలు అంటున్నారు. కేసీఆర్ సర్కార్ నియంత పాలనను ప్రజలు సాగనంపుతారని చెప్పారు. 8 ఏళ్లలో కేసీఆర్ కుటుంబమే బంగారమయంగా మారిందని విమర్శలు గుప్పించారు.

హైదరాబాద్ లో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశం బీజేపీలో మాత్రమే కాదు.. తెలంగాణ రాజకీయాలపైనా తన ముద్రవేయబోతోంది. జులై 2-3 తేదీల్లో జరిగే ఈ సమావేశానికి భారతీయ జనతాపార్టీ నాయకత్వం మొత్తం భాగ్యనగరానికి తరలిరానుంది. రెండురోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో పార్టీకి సంబంధించి కీలక నిర్ణయాలతో పాటు ముఖ్యమైన నియామాకాలు కూడా చేపట్టనున్నారు. ఇక కొవిడ్ తరువాత జరుగుతున్న తొలి పూర్తి స్థాయి కార్యవర్గ సమావేశాన్ని తెలంగాణలో నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో పార్టీ విస్తరణ కోసం సర్వశక్తులు ఒడ్డుతున్న కమలదళం.. ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో పార్టీ విస్తరణకు మార్గం నిర్మించనుంది.

Delhi : బీజేపీ ఆఫీసుపై కేసీఆర్ బొమ్మ పెట్టుకోకుంటే జరిగేది అదే..: కేటీఆర్

ఈ సమావేశాల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, పార్లమెంటరీ చైర్‌పర్సన్ హోదాలో ప్రధాని నరేంద్రమోదీతో పాటు ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీలో సభ్యుడిగా ఉన్న పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కీలక నాయకత్వం వ్యవహరిస్తారు. వీరితో పాటు పార్టీలో కీలకనేత అయిన హోంమంత్రి అమిత్ షా, అదే విధంగా 19 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశాల్లో పాల్గొంటారు. జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఇందులో సభ్యులుగా ఉన్న 80 మంది ఆఫీసు బేరర్లు హాజరవుతారు. పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి హాజరయ్యే ఈ సమావేశాల్లో కీలకమైన అంశాలపై చర్చించే అవకాశం ఉంది.