Samajavaragamana : ఓటీటీలోనూ సామజవరగమన రికార్డులు.. 72 గంట‌ల్లో 200 మిలియ‌న్..

యంగ్ హీరో శ్రీ విష్ణు (Sree Vishnu), మ‌ల‌యాళ భామ‌ రెబా మోనికా జాన్ (Reba Monica John) జంట‌గా న‌టించిన చిత్రం సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న (Samajavaragamana).

Samajavaragamana : ఓటీటీలోనూ సామజవరగమన రికార్డులు.. 72 గంట‌ల్లో 200 మిలియ‌న్..

Samajavaragamana

Updated On : August 1, 2023 / 3:49 PM IST

Samajavaragamana OTT record : యంగ్ హీరో శ్రీ విష్ణు (Sree Vishnu), మ‌ల‌యాళ భామ‌ రెబా మోనికా జాన్ (Reba Monica John) జంట‌గా న‌టించిన చిత్రం సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న (Samajavaragamana). అనిల్ సుంకర సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్‌పై ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి రాజేష్ దండా ఈ చిత్రాన్నినిర్మించ‌గా రామ్ అబ్బరాజు దర్శకత్వం వ‌హించారు. జూన్ 29న ప్రేక్ష‌కులకు ముందుకు వ‌చ్చిన ఈ సినిమా థియేట‌ర్ల వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించింది.

RGV : ఆర్జీవీ సినిమాల్లోకి ఎలా వచ్చాడో తెలుసా? అందుకే ఇప్పుడు ఇలా ఆర్జీవీ డెన్‌తో..

ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూశారు. ఆహా వేదిక‌గా జూలై 27 నుంచి స్ట్రీమింగ్ అవుతుండ‌గా అక్క‌డ కూడా రికార్డులను సృష్టిస్తోంది. కేవ‌లం 72 గంటల్లోనే ఏకంగా 200 మిలియన్ కి పైగా స్ట్రీమింగ్ మినిట్స్ నమోదు చేసింది. ఆహా ఓటీటీ సంస్థ ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ ఓ ప్ర‌త్యేక పోస్ట‌ర్‌ను సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేసింది.

గోపి సుందర్ సంగీతం అందించిన ఈ సినిమాను తొలుత‌ ఓటీటీలో జూలై 28న విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. కానీ.. ప్రేక్ష‌కుల డిమాండ్ మేర‌కు ఒక రోజు ముందుగానే స్ట్రీమింగ్ చేశారు. సీనియ‌ర్ న‌టుడు నరేష్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యింగర్, వెన్నెల కిశోర్, రఘుబాబు, రాజీవ్ కనకాల, దేవి ప్రసాద్‌లు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ముఖ్యంగా న‌రేశ్ కామెడి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది.

Allu Arjun : బన్నీ సరసన ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ హీరోయిన్.. త్రివిక్రమ్ సినిమాలో..?

Samajavaragamana

Samajavaragamana