Samantha : సమంత నయనతార కౌగిలింత.. మధ్యలో నయన్ ప్రియుడు

ప్రస్తుతం నయనతార, సమంత ఇద్దరూ కలిసి విగ్నేష్ శివన్ దర్శకత్వంలోనే ‘కాథువాక్కుల రెండు కాదల్‌’ అనే తమిళ సినిమాలో నటిస్తున్నారు. దీంతో ఈ పుట్టిన రోజు వేడుకలకి సమంత కూడా హాజరైంది. ఈ

Samantha : సమంత నయనతార కౌగిలింత.. మధ్యలో నయన్ ప్రియుడు

Samantha (2)

Updated On : November 20, 2021 / 8:32 AM IST

 

Samantha :  మన హీరోయిన్స్ లో సినిమాల పరంగా పోటీ ఉన్నా వ్యక్తిగతంగా మాత్రం అందరూ చాలా క్లోజ్ గా ఉంటారు. గతంలో చాలా మంది స్టార్ హీరోయిన్స్ కలిసి పార్టీలు చేసుకున్నారు. ఒకరి వేడుకలకు ఇంకొకరు హాజరవుతూ సన్నిహితంగా మెలుగుతారు. ఇటీవల చైతన్యతో విడాకుల తర్వాత సమంత తన ఫ్రెండ్స్ అందరి బర్త్ డే వేడుకలకి వెళ్తుంది. తాజాగా నయనతార బర్త్ డే కి కూడా వెళ్లి నయన్ కి సర్ ప్రయిజ్ ఇచ్చింది. మొన్న నయన్ బర్త్ డే కావడంతో నయన్ ప్రియుడు డైరెక్టర్ విగ్నేష్ శివన్ రాత్రి నయన్ బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా చేశాడు. ఈ వేడుకలకి నయన్, విగ్నేష్ సన్నిహితులు హాజరయ్యారు.

RGV : చంద్రబాబు ఏడుపుపై ఆర్జీవీ స్పెషల్ ట్వీట్

ప్రస్తుతం నయనతార, సమంత ఇద్దరూ కలిసి విగ్నేష్ శివన్ దర్శకత్వంలోనే ‘కాథువాక్కుల రెండు కాదల్‌’ అనే తమిళ సినిమాలో నటిస్తున్నారు. దీంతో ఈ పుట్టిన రోజు వేడుకలకి సమంత కూడా హాజరైంది. ఈ వేడుకల్లో సమంత నయనతారని కౌగలించుకొని ప్రేమగా విషెష్ తెలిపింది. వీళ్లిద్దరు కౌగిలించుకుంటుండగా నయన్ ప్రియుడు వీళ్ళ వెనకాలే ఉన్నాడు. అందరూ కలిసి నయన్ పుట్టిన రోజు వేడుకల్లో బాగా ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం నయన్ సమంతల కౌగిలింత ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ఇంత క్లోజ్ గా ఫోటో దిగడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేవు.

shruti hassan : అభిమానులతో చిట్ చాట్.. అలాంటి వాళ్ళని చూస్తే కోపంగా ఉంటుంది

సమంత ఈ ఫోటోలని షేర్ చేసి ట్విట్టర్లో ‘నయన్ కలలు కని ధైర్యంగా ఉండి తన ప్రతిభను చూపింది, ప్రస్తుతం నయన్ రాజ్యం ఏలుతోంది. పుట్టినరోజు శుభాకాంక్షలు నయన్‌’ అంటూ పోస్ట్ చేసింది.