Samantha : సమంత విడాకుల తర్వాత అనౌన్స్ చేసిన మొదటి సినిమా.. గట్టిగానే ప్లాన్ చేసింది

విడాకులు అయిన తర్వాత వరసగా సినిమాలు చేయాలని, ఆ సినిమాలు కూడా డిఫరెంట్ గా ఉండాలని ప్లాన్ చేస్తుంది. ఇవాళ దసరా రోజు తన నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చేసింది. డ్రీం వారియర్స్ పిక్చర్స్

Samantha : సమంత విడాకుల తర్వాత అనౌన్స్ చేసిన మొదటి సినిమా.. గట్టిగానే ప్లాన్ చేసింది

Sam

Samantha :  చై-సామ్ విడాకుల వార్త కొన్ని రోజులు మీడియాలో ట్రేండింగ్ లో ఉంది. తెలుగు సినీ ప్రేక్షకులంతా దీని గురించే మాట్లాడుకున్నారు. ఇప్పుడిప్పుడే దాని గురించి మర్చిపోతున్నారు అంతా. చై, సామ్ ఇద్దరూ తమ సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. సామ్ ఇటీవలే ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ ప్రోగ్రాంకి కూడా వచ్చింది. విడాకుల తర్వాత ఫస్ట్ టైం బుల్లితెర పై కనిపించింది. సమంత గత కొద్దిరోజులుగా సినిమాలు నిదానంగా చేస్తుంది. ప్రస్తుతం తమిళ్ లో ఒక సినిమా ఉంది. తెలుగులో ‘శాకుంతలం’ షూటింగ్ పూర్తి అయింది. ఇక వేరే ప్రాజెక్ట్స్ ఏవి కమిట్ అవ్వలేదు సమంత. తాజాగా ఇవాళ దసరా రోజున సమంత తన నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేసింది.

Sai Dharam Tej : సాయి ధరమ్ తేజ్ పై మెగా హీరోల ట్వీట్లు

సమంత సౌత్ లో స్టార్ హీరోయిన్. ఫ్యామిలీ మాన్ సిరీస్ తో నార్త్ లో కూడా బాగా పేరు తెచ్చుకుంది. సమంత ‘ఓ బేబీ’ సినిమా తప్ప వేరే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఏమి చేయలేదు. దీంతో హీరోల పక్కన కమర్షియల్ హీరోయిన్ గానే ఉంది ఇన్ని రోజులు. అనుష్క, నయనతార లాగా తాను కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తీసి సపరేట్ ఫ్యాన్ బేస్ తెచ్చుకోవాలని చూస్తుంది. ఇక విడాకులు అయిన తర్వాత వరసగా సినిమాలు చేయాలని, ఆ సినిమాలు కూడా డిఫరెంట్ గా ఉండాలని ప్లాన్ చేస్తుంది. ఇవాళ దసరా రోజు తన నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చేసింది. డ్రీం వారియర్స్ పిక్చర్స్ నిర్మాణంలో శాంతరూబన్ జ్ఞానశేఖరన్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్టు అనౌన్స్ చేసింది. ఇది తెలుగు తమిళ్ లో చిత్రీకరించనున్నారు. ఇది లేడీ ఓరియెంటెడ్ కథ అని సమాచారం. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వబోతోంది. ఇక ఈ సినిమాతో సమంత ఫుల్ ఫామ్ లోకి వచ్చి వరుస సినిమాలు చేయాలని ప్లాన్ చేసుకుంటుంది. అభిమానులు కూడా అదే కోరుకుంటున్నారు.