Samantha : బాలిలో సమంత ఫ్యాన్ ఫాలోయింగ్.. సమంతతో సెల్ఫీ తీసుకున్న కోతి.. పిక్ చూశారా..?

ప్రస్తుతం బాలిలో ఉన్న సమంత అక్కడ ప్రకృతిని ఎంజాయ్ చేస్తుంది. ఇక తాజాగా సమంతతో కలిసి ఒక కోతి సెల్ఫీ దిగింది. ఆ ఫోటో చూశారా..?

Samantha : బాలిలో సమంత ఫ్యాన్ ఫాలోయింగ్.. సమంతతో సెల్ఫీ తీసుకున్న కోతి.. పిక్ చూశారా..?

Samantha selfie with monkey in indonesia Bali

Updated On : July 28, 2023 / 4:19 PM IST

Samantha : కొన్నాళ్ల నుంచి అనారోగ్యంతోబాధ పడుతున్న సమంత.. ఒక పక్క సినిమాలు చేస్తూ మరో పక్క చికిత్స తీసుకుంటూ వస్తుంది. అయితే ఇటీవల సమంత ఒక సంవత్సరం పాటు సినిమాలకు బ్రేక్ ప్రకటించడంతో.. మయోసైటిస్ చికిత్స కోసం అమెరికా వెళ్లనుందని, పూర్తి ఆరోగ్యంగా మారడానికే సమంత సినిమాలకు బ్రేక్ ప్రకటించిందని వార్తలు వచ్చాయి. అయితే గత కొన్ని రోజులుగా సమంత చేస్తున్న పోస్టులు చూస్తుంటే.. తాను శారీరకంగా కాదు, మానసికంగా కోలుకోవడానికే విరామం తీసుకున్నట్లు తెలుస్తుంది.

Spy Movie : ఏ ప్రకటన లేకుండా ఓటీటీకి వచ్చేసిన నిఖిల్ స్పై.. ఎక్కడ స్ట్రీమ్ అవుతుందో తెలుసా..?

ఇటీవల కొన్ని రోజులు కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్ కి వెళ్లి అక్కడ ప్రశాంతత కోసం ధ్యానం, పూజలు చేసిన సమంత ఇప్పుడు ఇండోనేషియాలోని బాలిలో ప్రకృతి ఒడిలో ఎంజాయ్ చేస్తుంది. ఇక పలు దేవాలయాలని, ప్రకృతి ప్రదేశాలని సందర్శిస్తూ ఆ ఫోటోలని, వీడియోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తాజాగా షేర్ చేసిన రెండు ఫోటోలు నెటిజెన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. అందులో ఒక కోతి సమంత ఒళ్ళో కూర్చొని సెల్ఫీ తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఈ పిక్ చూసిన నెటిజెన్స్.. “జంతువుల్లో కూడా సమంత ఫాలోయింగ్ మాములుగా లేదుగా, కోతులే సెల్ఫీలు తీసుకుంటున్నాయి” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Varun Tej : వరుణ్ తేజ్ కొత్త సినిమా ఓపెనింగ్.. పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘మట్కా’

ఇక మరో పిక్ లో సమంత బుజం పై కోతి కూర్చొని కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే, సమంత బాలిలో సహజసిద్ధమైన చికిత్సలను తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఉదయం వ్యాయామాలు, యోగాలు, ఆరు నిమిషాల పాటు 4 డిగ్రీల చల్లటి నీళ్లలో ఉండడం, ప్రకృతి మధ్య గడపడం.. ఇవన్నీ చూస్తుంటే సమంత నేచురల్ థెరపీ ట్రై చేస్తునట్లు తెలుస్తుంది. ఏదైనా సమంత పూర్తిగా కోలుకొని మళ్ళీ తిరిగి వచ్చి సినిమాలు చేయాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)