Samantha: కండల కోసం సమంత కసరత్తు.. Video

అందాల భామ సమంత ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తన మాజీ భర్త నాగచైతన్యతో విడాకుల తరువాత, ఆమె తన స్పీడు మరింత పెంచేసింది....

Samantha: కండల కోసం సమంత కసరత్తు.. Video

Samantha Workout Video Goes Viral

Updated On : April 16, 2022 / 1:53 PM IST

Samantha: అందాల భామ సమంత ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తన మాజీ భర్త నాగచైతన్యతో విడాకుల తరువాత, ఆమె తన స్పీడు మరింత పెంచేసింది. లీడ్ రోల్స్‌లో పలు సినిమాలను లైన్‌లో పెట్టిన ఈ బ్యూటీ, అటు హీరోయిన్‌గా కూడా పలు ప్రాజెక్టులను ఓకే చేస్తోంది. కేవలం తెలుగులోనే కాకుండా సమంత ఇతర భాషల్లోనూ సినిమాలు ఓకే చేస్తూ బిజీగా మారింది.

Samantha : బాలీవుడ్‌‌కి మకాం.. ముంబైలో ఇల్లు కొంటున్న సమంత..

కేవలం లీడ్ రోల్స్, హీరోయిన్ పాత్రలే కాకుండా పుష్ప చిత్రంలో ‘ఊ అంటావా..’ అనే పాటతో ఐటెం సాంగ్స్‌కు కూడా తాను రెడీ అంటూ దర్శకనిర్మాతలకు క్లూ ఇచ్చేసింది ఈ బ్యూటీ. కాగా తన బాడీని ఫిట్‌గా ఉంచుకునేందుకు సమంత జిమ్‌లో తెగ కష్టపడుతూ ఉంటుంది. దీనికి సంబంధించి పలుమార్లు ఆమె తన వర్కవుట్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కూడా. అయితే తాజాగా సమంత మరోసారి తన హెవీ వర్కవుట్స్‌కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. 2022-23 సంవత్సరం తన బాడీకి, మైండ్‌కు చాలా ఛాలెంజింగ్‌గా ఉండబోతున్నట్లు ఆమె పేర్కొంది.

Samanrtha

Samanrtha

Samantha : సమంత ఒక్కో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కి ఎంత సంపాదిస్తుందో తెలుసా??

జిమ్‌లో ఈ విధంగా బరువులు ఎత్తుతూ వర్కవుట్స్ చేస్తున్న సమంత తన ఫ్యాన్స్ కూడా ఫిట్‌గా ఉండాలని కోరుతుంది. అయితే నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే ఇలాంటి హెవీ వర్కవుట్స్ చేయాలని ఆమె సూచిస్తోంది. ఇక సినిమాల పరంగా సమంత ప్రస్తుతం శాకుంతలం, యశోద అనే రెండు పాన్ ఇండియా సినిమాల్లో లీడ్ రోల్స్ ప్లే చేస్తుండగా.. బాలీవుడ్‌‌లో వరుణ్ ధావన్ సినిమాలో హీరోయిన్‌గా కనిపించబోతుంది. అంతేగాక రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ – శివ నిర్వాణ కాంబోలో రాబోతున్న సినిమాలో కూడా సమంత హీరోయిన్‌గా నటించనుంది.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)