Samsung Galaxy M33 5G : క్వాడ్ కెమెరాలతో Galaxy M-33 5G ఫోన్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

Samsung Galaxy M33 5G : శాంసంగ్ M సిరీస్ నుంచి సరికొత్త 5G ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చేసింది. క్వాడ్ కెమెరాల సెటప్, 6,000mAh భారీ బ్యాటరీ సామర్థ్యంతో లాంచ్ అయింది.

Samsung Galaxy M33 5G : క్వాడ్ కెమెరాలతో Galaxy M-33 5G ఫోన్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

Samsung Galaxy M33 5g With Quad Rear Cameras, 120hz Display, 6,000mah Battery Launched In India Price, Specifications

Samsung Galaxy M33 5G : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ M సిరీస్ నుంచి సరికొత్త 5G ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చేసింది. అద్భుతమైన క్వాడ్ కెమెరాల సెటప్, 6,000mAh భారీ బ్యాటరీ సామర్థ్యంతో శనివారం (ఏప్రిల్ 2) మధ్యాహ్నం Samsung Galaxy M33 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. ఈ కొత్త Samsung స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్-రేట్ డిస్‌ప్లేతో వచ్చింది. 5nm octa-core Exynos ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. Samsung Galaxy M33 5G గరిష్టంగా 8GB RAM , గరిష్టంగా 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజీని అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్ 50-MP మెయిన్ సెన్సార్‌తో క్వాడ్ రియర్ కెమెరా యూనిట్‌తో వచ్చింది. ఆబ్జెక్ట్ ఎరేజర్ ఫీచర్, బోకె మోడ్‌తో సహా కెమెరా మోడ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. వాయిస్ ఫోకస్ ఫీచర్‌ను కూడా అందిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను రిమూవ్ చేసేందుకు కాల్‌ల సమయంలో రిసీవర్ వాయిస్‌ని పెంచుకోవచ్చు. పాత Galaxy M-సిరీస్ ఫోన్‌ల మాదిరిగానే.. ఈ కొత్త Galaxy M33 5G 25W ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. అలాగే భారీ 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Samsung Galaxy M33 5G ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో Samsung Galaxy M33 5G మోడల్‌కి ఫోన్ కనీస ధర (6GB +128GB స్టోరేజ్) రూ.18,999 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వెర్షన్‌లో కూడా వస్తుంది. ఈ ఫోన్ ధర రూ. 20,499గా ఉండనుంది. Samsung రెండు మోడళ్లను రూ. 17,999, రూ.19,999 ప్రారంభ ధరకు అందిస్తోంది. Samsung Galaxy M33 5G రెండు కలర్ల ఆప్షన్లలో గ్రీన్, బ్లూ వచ్చింది. ఏప్రిల్ 8 నుంచి అమెజాన్ శామ్‌సంగ్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్ ద్వారా అందుబాటులోకి రానుంది. Samsung Galaxy M33 5Gపై లాంచ్ ఆఫర్‌లను అందిస్తోంది. ICICI బ్యాంక్ కార్డ్‌లతో కొనుగోలు చేసే కస్టమర్‌లకు రూ. 2,000 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ చేస్తోంది. ఇక No-Cost EMI ఆప్షన్లతో ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లను కూడా ఫోన్ అందిస్తోంది.

Samsung Galaxy M33 5g With Quad Rear Cameras, 120hz Display, 6,000mah Battery Launched In India Price, Specifications (1)

Samsung Galaxy M33 5g With Quad Rear Cameras, 120hz Display, 6,000mah Battery Launched In India Price, Specifications

Samsung Galaxy M33 5G స్పెసిఫికేషన్స్ :
డ్యూయల్ సిమ్ (Dual SIM) శాంసంగ్ గెలాక్సీ M33 5G ఆండ్రాయిడ్ 12పై వన్ UI 4.1తో రన్ అవుతుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల పూర్తి HD+ ఇన్ఫినిటీ-V డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా అందిస్తోంది. ఫోన్ కింది భాగంలో ఆక్టా-కోర్ 5nm Exynos ప్రాసెసర్‌ అందిస్తోంది. గరిష్టంగా 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజీతో వచ్చింది. Samsung RAM ప్లస్ ఫీచర్‌తో, Galaxy M33 5Gలోని RAM ఇంటర్నల్ స్టోరేజీతో వర్చువల్‌గా 16GB వరకు పొడిగించవచ్చు.

ఇక, ఫోటోలు, వీడియోల కోసం, Galaxy M33 5G క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో వచ్చింది. f/1.8 ఎపర్చర్‌తో 50-MP ప్రైమరీ సెన్సార్‌తో వచ్చింది. కెమెరా యూనిట్ 120-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్-వ్యూతో 5-MP అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్, f/2.4 ఎపర్చరు, f/2.2 ఎపర్చర్‌తో 2-MP మాక్రో షూటర్, f/2.2 ఎపర్చరుతో సెన్సార్ 2-MP డెప్త్‌ను కలిగి ఉంది. వెనుక రియర్ కెమెరా బోకె ఎఫెక్ట్, సింగిల్ టేక్, ఆబ్జెక్ట్ ఎరేజర్, వీడియో TNR (టెంపోరల్ నాయిస్ రిడక్షన్) వంటి విభిన్న ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ మోడ్‌లకు సపోర్టు చేస్తుంది. ముందు భాగంలో, హ్యాండ్‌సెట్ 8-MP సెల్ఫీ షూటర్‌ను కలిగి ఉంది. Samsung Galaxy M33 5Gలోని కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, Wi-Fi, బ్లూటూత్ GPS ఉన్నాయి. Samsung Galaxy M33 5G కూడా సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో వస్తుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు చేసే 6,000mAh బ్యాటరీతో వచ్చింది.

Read Also : Samsung Galaxy M33 5G : ఏప్రిల్ 2న శాంసంగ్ గెలాక్సీ M33 5G వచ్చేస్తోంది.. అమెజాన్‌లోనే సేల్..!