Sandeep Reddy Vanga : ఒకే ఒక్క తెలుగు సినిమా సందీప్ వంగ కెరీర్ మార్చేసింది.. స్టార్లతో బాలీవుడ్ లో వరుస సినిమాలు

ప్రస్తుతం సందీప్ వంగ బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇందులో చాలా మంది బాలీవుడ్ స్టార్లు నటిస్తున్నారని సమాచారం. ఈ సినిమా తర్వాత........................

Sandeep Reddy Vanga : ఒకే ఒక్క తెలుగు సినిమా సందీప్ వంగ కెరీర్ మార్చేసింది.. స్టార్లతో బాలీవుడ్ లో వరుస సినిమాలు

Sandeep Reddy Vanga getting big offers from stars in bollywood

Sandeep Reddy Vanga :  తెలుగులో పలు సినిమాలకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసి అనంతరం 2017లో అర్జున్ రెడ్డి సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ. విజయ్ దేవరకొండ, షాలిని పాండే జంటగా తెరకెక్కిన రా అండ్ రస్టిక్ లవ్ ఇంటెన్స్ స్టోరీ అర్జున్ రెడ్డి యూత్ కి బాగా కనెక్ట్ అయి భారీ విజయం సాధించింది. కేవలం 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా ఈ సినిమా 20 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి సూపర్ హిట్ సినిమాగా నిలిచింది.

అర్జున్ రెడ్డి సినిమా తర్వాత అందరూ ఈ డైరెక్టర్ ఎలాంటి సినిమా తీస్తాడో అని వెయిట్ చేశారు. కానీ బాలీవుడ్ నుంచి పిలుపు రావడంతో అక్కడ అర్జున్ రెడ్డి సినిమాని కబీర్ సింగ్ పేరుతో షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా తెరకెక్కించగా ఈ సినిమా కుడా మంచి విజయం సాధించింది. దీంతో సందీప్ వంగ పేరు బాలీవుడ్ లో కూడా మారుమ్రోగిపోయింది. ఈ సినిమాని భూషణ్ కుమార్ నిర్మాణంలో బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ టీ సిరీస్ నిర్మించింది. ఈ సినిమా హిట్ అవ్వడంతో ఇప్పుడు ఇదే నిర్మాణ సంస్థ సందీప్ వంగతో మరో మూడు భారీ సినిమాలు అనౌన్స్ చేసి నిర్మిస్తుంది.

ప్రస్తుతం సందీప్ వంగ బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇందులో చాలా మంది బాలీవుడ్ స్టార్లు నటిస్తున్నారని సమాచారం. ఈ సినిమా తర్వాత ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు. ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ తో ఓ సినిమాని ప్రకటించాడు. తెలుగులో ఒకేఒక్క సినిమా చేసిన సందీప్ వంగ ఇప్పుడు వరుసగా స్టార్ హీరోలతో బాలీవుడ్ లో సినిమాలు తెరకెక్కిస్తున్నాడు. ఒక్క తెలుగు సినిమాతోనే బాలీవుడ్ నిర్మాణ సంస్థ సందీప్ కి ఏకంగా నాలుగు భారీ సినిమాలు ఇచ్చింది.

Allu Arjun-Sandeep Vanga : సందీప్ వంగతో బన్నీ సినిమా.. ప్రభాస్ స్పిరిట్, బోయపాటి-బన్నీ సినిమాలు వాయిదా పడ్డట్టేనా?

మరి సందీప్ వంగ ఇన్ని ప్రాజెక్ట్స్ ని ఎప్పుడు తెరకెక్కిస్తాడో అందులో ఎన్ని విజయాలు సాధిస్తాడో చూడాలి. ఒక్క చిన్న సినిమాతో ఏకంగా బాలీవుడ్ లోని అగ్ర నిర్మాణ సంస్థలో ముగ్గురు స్టార్ హీరోలతో సినిమాలంటే మాములు విషయం కాదు. డైరెక్టర్ గా మాత్రమే కాకుండా ఇప్పుడు రాబోయే మూడు సినిమాలకు తన నిర్మాణ సంస్థ భద్రకాళి పిక్చర్స్ నుంచి తన సోదరుడిని కూడా నిర్మాతగా నిలబెట్టాడు. సందీప్ చేతిలో ఉన్న మూడు సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి