Sankranthi Movies : ఈ సారి సంక్రాంతి దిల్ రాజు వర్సెస్ టాలీవుడ్.. ఆ సినిమా డిస్ట్రిబ్యూషన్ కూడా దిల్ రాజు తీసుకున్నాడా ??

టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా సంక్రాంతి సినిమాల థియేటర్స్ వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సారి సంక్రాంతికి సీనియర్ స్టార్ హీరోలు బాలకృష్ణ వీరసింహా రెడ్డి సినిమాతో, చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో బరిలోకి దిగుతున్నారు. దీంతో ఈ సారి సంక్రాంతి పోరు గట్టిగానే...........

Sankranthi Movies : ఈ సారి సంక్రాంతి దిల్ రాజు వర్సెస్ టాలీవుడ్.. ఆ సినిమా డిస్ట్రిబ్యూషన్ కూడా దిల్ రాజు తీసుకున్నాడా ??

Sankranthi Movies issue tollywood vs Dil raju

Sankranthi Movies : టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా సంక్రాంతి సినిమాల థియేటర్స్ వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సారి సంక్రాంతికి సీనియర్ స్టార్ హీరోలు బాలకృష్ణ వీరసింహా రెడ్డి సినిమాతో, చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో బరిలోకి దిగుతున్నారు. దీంతో ఈ సారి సంక్రాంతి పోరు గట్టిగానే ఉండబోతుంది అనుకున్నారు. మధ్యలో దిల్ రాజు తమిళ హీరో విజయ్ తో తాను నిర్మిస్తున్న వరిసు (వారసుడు) సినిమాని కూడా సంక్రాంతికి ప్రకటించాడు.

తెలుగు నిర్మాతల మండలి పండగలకి తెలుగు సినిమాలకి ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనడంతో ఈ వివాదం మొదలైంది. ఇప్పటికే దిల్ రాజు తన చేతిలో ఉన్న చాలా థియేటర్స్ ని వారసుడు సినిమాకి బ్లాక్ చేసి ఉంచాడు అనే టాక్ రావడంతో చిరంజీవి, బాలయ్య అభిమానులు తమ హీరోలకి ఎక్కువ థియేటర్స్ ఇవ్వాలని రచ్చ కూడా చేస్తున్నారు. ఇప్పటికే దిల్ రాజు వర్సెస్ మిగిలిన రెండు సినిమాలు అన్నట్టు సంక్రాంతి వార్ ఉండటంతో తాజాగా ఇది మరింత ముదిరింది.

ఒకపక్క తాను నిర్మిస్తున్న వారసుడు సినిమాని డైరెక్ట్ గా రిలీజ్ చేస్తూనే మరోపక్క ఇంకో తమిళ్ స్టార్ హీరో అజిత్ సినిమా తునివు(తెగింపు)ని కూడా తెలుగు స్టేట్స్ లో దిల్ రాజు రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నట్టు సమాచారం. అధికారికంగా వేరేవాళ్లు డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నా అజిత్ తెగింపు సినిమా రిలీజ్ వెనుక దిల్ రాజే ఉన్నట్టు టాలీవుడ్ టాక్. రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చేసి చాలా వరకు థియేటర్స్ ని తన చేతిలోనే ఉంచుకోవాలని భావిస్తున్నట్టు పలువురు దిల్ రాజు మీద ఆరోపణలు చేస్తున్నారు. మరి మైత్రి నిర్మాణ సంస్థ వాళ్ళు బాలయ్య, చిరంజీవి సినిమాలకి థియేటర్స్ ఎలా అడ్జస్ట్ చేస్తారో అని అందరూ టెన్షన్ పడుతున్నారు.

Harish Shankar : అలాంటి వాళ్లందరికీ చెప్పుదెబ్బ ధమాకా సినిమా.. హీరోయిజం, ఎంటర్టైన్మెంట్ సినిమాలే ఆడతాయి..

అసలే తెలుగు వారికి పెద్ద పండగ, ఫ్యామిలీలంతా సినిమాలకి వెళ్ళాలి అనుకునే సమయం, తెలుగు స్టేట్స్ లో ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు ఉన్నప్పుడు అంత తొందరగా వేరే వల్ల సినిమాలని చూడరు ప్రేక్షకులు. మరి ఏమవుతుందో చూడాలి. ఏ సినిమాకి ఎన్ని థియేటర్స్ లభిస్తాయో చూడాలి. దిల్ రాజు అస్సలు తగ్గకపోవడం, పైగా ఇంకో తమిళ సినిమాని కూడా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉండటంతో మొత్తానికి ఈ సారి సంక్రాంతి మాత్రం దిల్ రాజు వర్సెస్ టాలీవుడ్ అన్నట్టే ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.