JP Nadda: చీకటి నుంచి వెలుగులోకి నడిపించిన భాష సంస్కృతం: జేపీ నద్దా

మనల్ని చీకటిలోంచి వెలుగులోకి నడిపించిన భాష సంస్కృతం అన్నారు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా. శనివారం ఢిల్లీలోని సెంట్రల్ సంస్కృత యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

JP Nadda: చీకటి నుంచి వెలుగులోకి నడిపించిన భాష సంస్కృతం: జేపీ నద్దా

Jp Nadda

JP Nadda: మనల్ని చీకటిలోంచి వెలుగులోకి నడిపించిన భాష సంస్కృతం అన్నారు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా. శనివారం ఢిల్లీలోని సెంట్రల్ సంస్కృత యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్కృతం భాషపై ప్రశంసలు కురిపించారు. ‘‘సైన్స్, మ్యాథ్స్, ఫిలాసఫీ… ఇలా ప్రతి అంశానికి సంబంధించిన మూలాలు సంస్కృతంలో ఉన్నాయి. ఈ భాషను పరిరక్షించుకోవాలి. సంస్కృతాన్ని కాపాడేందుకు అసవరమైన అన్ని చర్యలు తీసుకుంటాం.

Narendra Modi: జాతీయ నూతన విద్యా విధానంపై ప్రధాని సమీక్ష

ఎందుకంటే మాది బాధ్యతాయుతమైన ప్రభుత్వం. సంస్కృతాన్ని గుర్తించే ప్రతి సమాజం.. సాంస్కృతిక నేపథ్యం కలిగి ఉన్నట్లే’’ అని నద్దా వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో హిందీ భాషను జాతీయ భాషగా చేసే అంశంపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. నటి కంగనా రనౌత్ సంస్కృత భాషను జాతీయ భాషగా ప్రకటించాలని కోరింది. ఈ నేపథ్యంలో జేపీ నద్దా సంస్కృతం గురించి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.