Narendra Modi: జాతీయ నూతన విద్యా విధానంపై ప్రధాని సమీక్ష

‘జాతీయ నూతన విద్యా విధానం-2020’పై ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హైబ్రిడ్ విద్యా విధానాన్ని ఎక్కువగా అమలు చేయాలని సూచించారు.

Narendra Modi: జాతీయ నూతన విద్యా విధానంపై ప్రధాని సమీక్ష

Narendra Modi

Narendra Modi: ‘జాతీయ నూతన విద్యా విధానం-2020’పై ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హైబ్రిడ్ విద్యా విధానాన్ని ఎక్కువగా అమలు చేయాలని సూచించారు. ఉన్నత పాఠశాల విద్యకు సంబంధించి సైన్స్ ల్యాబ్‌ల ద్వారా విద్యార్థులు, స్థానిక రైతులతో కలిసిపోయేలా, భూసార పరీక్షలు జరిపేలా చూడాలన్నారు. ‘‘సంప్రదాయ విద్యను టెక్నాలజీతో అనుసంధానం చేయాలి. అలాగే ఆన్‌లైన్ ఎడ్యుకేషన్, ఆఫ్‌లైన్ ఎడ్యుకేషన్.. రెండింటినీ సరిగ్గా వాడుతూ హైబ్రిడ్ సిస్టమ్‌ను అమలు చేయాలి.

PM Modi in Germany: భారతదేశంలో నేడు 68వేలకు‌పైగా స్టార్టప్‌లు.. బెర్లిన్‌లో మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

విద్యార్థులు టెక్నాలజీకి ఎక్కువగా ఆకర్షితులవ్వకుండా, రెండు విధానాల్లో చదువు నేర్చుకునేలా చూడాలి’’ అని సూచించారు. రెండేళ్ల క్రితం జాతీయ నూతన విద్యా విధానాన్ని మోదీ ప్రారంభించారు. ఈ విధానంలో ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. 40 శాతం కంటెంట్ ఈ విధానంలో బోధించేందుకు అనుమతించారు.