PM Modi in Germany: భారతదేశంలో నేడు 68వేలకు‌పైగా స్టార్టప్‌లు.. బెర్లిన్‌లో మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ జర్మనీతో తన పర్యటనను ప్రారంభించారు. జర్మనీలో ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ తో సమావేశమైన అనంతరం మోదీ అక్కడి ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ క్రమంలో భారత్ మాతా కీ జై...

PM Modi in Germany: భారతదేశంలో నేడు 68వేలకు‌పైగా స్టార్టప్‌లు.. బెర్లిన్‌లో మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

Pm Modi

PM Modi in Germany: మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ జర్మనీతో తన పర్యటనను ప్రారంభించారు. జర్మనీలో ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ తో సమావేశమైన అనంతరం మోదీ అక్కడి ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ క్రమంలో భారత్ మాతా కీ జై అనే నినాదాంతో మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సమయంలో అక్కడి ప్రవాస భారతీయులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. మోదీ ప్రసంగిస్తూ.. ఇప్పుడు భారత్ రిస్క్ తీసుకోవడానికి భయపడదని, పెద్ద ఆలోచనలు చేస్తుందని అన్నారు. మీ ప్రేమ, దీవెనలు నాకు బలం. ఈ రోజు మోడీ ప్రభుత్వం గురించి మాట్లాడటానికి రాలేదు. కోట్లాది మంది భారతీయుల గురించి నా హృదయపూర్వకంగా మీతో మాట్లాడాలని భావిస్తున్నాను. నేను కోట్లాది మంది భారతీయుల గురించి ప్రస్తావించినప్పుడు, వారిలో ఇక్కడ నివసించే వారు కూడా ఉన్నారంటూ మోదీ పేర్కొన్నారు.

PM Modi in Europe: యూరోప్‌లో భారత ప్రధాని: 65 గంటల్లో 25 కీలక సమావేశాల్లో పాల్గొననున్న మోదీ

21వ శతాబ్దపు ఈ సమయం భారతీయులకు చాలా ముఖ్యమైన సమయమన్న మోదీ.. నేడు భారతదేశం దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోందన్నారు. 2019లో దేశ ప్రజలు మునుపెన్నడూ లేని విధంగా ప్రభుత్వాన్ని పటిష్టం చేశారని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. భారతదేశాన్ని సర్వతోముఖంగా ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన నిర్ణయాత్మక ప్రభుత్వానికి భారత ప్రజలు అధికారాన్ని అప్పగించారన్నారు. ఆశల ఆకాశం ఎంత పెద్దదైందో నాకు తెలుసని, శ్రమతో అలసిపోయిన ఎంతో మంది భారతీయుల సహకారంతో భారతదేశం కొత్త శిఖరాలను చేరుకోగలదని కూడా నాకు తెలుసునని, భారతదేశం ఇప్పుడు సమయాన్ని కోల్పోదన్నారు. దేశ ప్రజలు అభివృద్ధికి నాయకత్వం వహించినప్పుడే దేశం పురోగమిస్తుందని, దేశ ప్రజలు దిశను నిర్ణయించినప్పుడు దేశం పురోగమిస్తుందని ప్రధాని చెప్పారు.

PM Modi : కోర్టుల్లో స్థానిక భాషల ఉపయోగంపై మోదీ కీలక వ్యాఖ్యలు

ఇప్పుడు నేటి భారతదేశంలో ప్రభుత్వమే కాదు దేశ ప్రజలే చోదక శక్తి. దేశంలో డిజిట‌ల్ చెల్లింపుల‌ను ప్రోత్స‌హిస్తున్న‌ట్లు ప్ర‌ధాన మంత్రి తెలిపారు. కొత్త భారతదేశం ఇకపై సురక్షితమైన భవిష్యత్తు గురించి ఆలోచించదని, కొత్త ఆవిష్కరణకు ఎలాంటి అవరోధాలను ఎదుర్కోనైనా ముందుకెళ్తుందని అన్నారు. 2014 నాటికి భారతదేశంలో కేవలం 200-400 స్టార్టప్‌లు మాత్రమే ఉండేవి. నేడు 68 వేలకు పైగా స్టార్టప్‌లు, డజన్ల కొద్దీ యునికార్న్‌లు ఉన్నాయి. నేడు ప్రభుత్వం ఆవిష్కర్తలను ఉత్సాహంతో ముందుకు తీసుకువెళుతోందని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.