Santosh Sobhan : ప్రభాస్ అన్న సంస్థలో మూడు కాదు ముప్పై సినిమాలు చేయమన్నా చేస్తాను..

సంతోష్ శోభన్ మాట్లాడుతూ.. ప్రభాస్ అన్న ఇచ్చే సపోర్ట్ గురించి చెప్పాలంటే నాకు మాటలు సరిపోవు. ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ హీరో అయి ఉండి నా చిన్న సినిమాలకి ప్రమోషన్స్ చేస్తారు. ఇప్పుడు కళ్యాణం కమనీయం సినిమాలో కూడా..................

Santosh Sobhan : ప్రభాస్ అన్న సంస్థలో మూడు కాదు ముప్పై సినిమాలు చేయమన్నా చేస్తాను..

Santosh Sobhan comments on Prabhas and UV Creations

Santosh Sobhan :  దివంగత డైరెక్టర్ శోభన్ తనయుడిగా, చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తను నేను సినిమాతో హీరోగా మారి అనంతరం హీరోగా వరుస సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నాడు సంతోష్ శోభన్. సంతోష్ తండ్రి శోభన్ ప్రభాస్ కి వర్షం లాంటి పెద్ద హిట్ ఇవ్వడంతో అప్పటి హిట్ ని ఇంకా గుర్తుపెట్టుకొని ప్రభాస్ తన మంచితనంతో సంతోష్ ని దగ్గరికి తీసుకొని తన నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ లో సంతోష్ హీరోగా సినిమాలు చేస్తున్నాడు.

తాజాగా సంతోష్‌ శోభన్‌ హీరోగా, ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా తెరకెక్కిన ‘కళ్యాణం కమనీయం’ అనే సినిమా జనవరి 14న సంక్రాంతి కానుకగా రానుంది. ఈ సినిమా కూడా ప్రభాస్ నిర్మాణ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ నిర్మాణంలో కొత్త దర్శకుడు అనిల్ కుమార్ తెరకెక్కించాడు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సంతోష్ శోభన్ ప్రభాస్ గురించి, ఆయన నిర్మాణ సంస్థ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

KRK : నీ బాయ్‌ఫ్రెండ్ ని రిజెక్ట్ చేసినట్టే నిన్ను కూడా బాలీవుడ్ నుంచి పంపించేస్తాం.. రష్మికపై బాలీవుడ్ క్రిటిక్ సంచలన ట్వీట్..

సంతోష్ శోభన్ మాట్లాడుతూ.. ప్రభాస్ అన్న ఇచ్చే సపోర్ట్ గురించి చెప్పాలంటే నాకు మాటలు సరిపోవు. ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ హీరో అయి ఉండి నా చిన్న సినిమాలకి ప్రమోషన్స్ చేస్తారు. ఇప్పుడు కళ్యాణం కమనీయం సినిమాలో కూడా ఓ సాంగ్ ని విడుదల చేశారు. నేను ఆయన అభిమానిని కూడా. ప్రభాస్ అన్న ప్రేమ దక్కినందుకు చాలా అదృష్టం చేసుకొని ఉండాలి. యూవీ క్రియేషన్స్ సంస్థ నా ఫ్యామిలీ ప్రొడక్షన్ లాంటిది. ఇక్కడ ఇప్పటికే మూడు సినిమాలు చేశాను. ఇంకో ముప్పై సినిమాలు చేయడానికి కూడా రెడీ. అస్సలు ఆలోచించకుండా చేస్తాను అని అన్నాడు.