Sara Alikhan : ముంబై మెట్రోలో సారా అలీఖాన్..

ప్రస్తుతం మెట్రో ఇన్ డినో అనే ఓ సినిమా చేస్తోంది సారా. ఆదిత్య రాయ్ కపూర్ తో జంటగా ఈ సినిమాలో నటిస్తోంది. అనురాగ్ బసు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సంవత్సరం చివర్లో మెట్రో ఇన్ డినో సినిమా రాబోతుంది.

Sara Alikhan : ముంబై మెట్రోలో సారా అలీఖాన్..

Sara Ali Khan travelled in Mumbai Metro

Updated On : April 27, 2023 / 7:10 AM IST

Sara Alikhan :  అప్పుడప్పుడు సెలబ్రిటీలు సాధారణ జనాల్లాగే బస్సుల్లో, ట్రైన్స్ లో, ఆటోల్లో వెళుతూ ఉంటారు. అలా వెళ్లి వారి ఫోటోలు, వీడియోలతో ఫ్యాన్స్ కు మంచి జోష్ ఇస్తారు. తాజాగా బాలీవుడ్(Bollywood) హీరోయిన్ సారా అలీఖాన్(Sara Alikhan) కూడా ఇలాగే మెట్రోలో(Metro) వెళ్ళింది. సైఫ్ అలీఖాన్(Saif Alikhan) కూతురిగా సారా అలీఖాన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేస్తుంది.

ప్రస్తుతం మెట్రో ఇన్ డినో అనే ఓ సినిమా చేస్తోంది సారా. ఆదిత్య రాయ్ కపూర్ తో జంటగా ఈ సినిమాలో నటిస్తోంది. అనురాగ్ బసు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సంవత్సరం చివర్లో మెట్రో ఇన్ డినో సినిమా రాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. తాజాగా సారా అలీఖాన్ షూటింగ్ కు ముంబైలో మెట్రోలో వెళ్ళింది. సారా మెట్రోలో వెళ్తున్నప్పుడు తీసిన ఓ చిన్న వీడియో క్లిప్ ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ఆ వీడియో షేర్ చేసి.. నేను మీకంటే ముందే మెట్రోలో ఉన్నాను అంటూ డైరెక్టర్ అనురాగ్ బసు, హీరో ఆదిత్య రాయ్ కపూర్ ని ట్యాగ్ చేసింది.

Sara Ali Khan travelled in Mumbai Metro

Bhumika Chawla : కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమా ప్రమోషన్స్ లో ఎందుకు లేరు.. సంచలన వ్యాఖ్యలు చేసిన భూమిక..

సినిమా షూటింగ్ దశలో ఉండగానే ఇలా ప్రమోషన్స్ చేసేస్తున్నారా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక సారా షూటింగ్ కి మెట్రోలో వెళ్లడంతో మెట్రోలో ఉన్న సాధారణ ప్రజలు ఆశ్చర్యపోయారు. సారాతో ఫోటోలు దిగడానికి ఆసక్తి చూపించారు. సారా మెట్రోలో వెళ్లిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.