Sarath Babu : శరత్ బాబుకు పిల్లలు లేరు.. కోట్ల ఆస్తులన్నీ వాళ్ళకే..?

శరత్ బాబు సినిమాల్లో బాగానే సంపాదించారని సమాచారం. చెన్నై, హైదరాబాద్, తన సొంతూరు ఆముదాలవలసలో శరత్ బాబుకు ఇల్లు, ఆస్తులు ఉన్నట్టు సమాచారం.

Sarath Babu : శరత్ బాబుకు పిల్లలు లేరు.. కోట్ల ఆస్తులన్నీ వాళ్ళకే..?

Sarath Babu's assets Who will get discussions in Family

Sarath Babu :  ప్రముఖ సీనియర్ నటుడు శరత్ బాబు ఇటీవల కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో చికిత్స తీసుకుంటూ మరణించిన సంగతి తెలిసిందే. శరత్ బాబు మరణం తెలుగు, తమిళ పరిశ్రమల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. కమల్, రజిని, చిరంజీవి.. లాంటి స్టార్ హీరోలు సైతం శరత్ బాబుకి నివాళులు అర్పించారు. సౌత్ భాషల్లో దాదాపు 300 సినిమాలలో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు శరత్ బాబు.

అయితే శరత్ బాబు వైవాహిక జీవితం మాత్రం సంతోషంగా లేదని అంటారు. మొదట రమప్రభని పెళ్లి చేసుకొని కొన్నాళ్ల కాపురం తర్వాత విడిపోయారు. అనంతరం స్నేహ అనే ఆమెను వివాహం చేసుకోగా ఆమెతో కూడా విడిపోయారు శరత్ బాబు. ఈ ఇద్దరితోనూ శరత్ బాబుకి సంతానం కలగలేదు. దీంతో శరత్ బాబుకి వారసులు ఎవరూ లేరు.

శరత్ బాబు సినిమాల్లో బాగానే సంపాదించారని సమాచారం. చెన్నై, హైదరాబాద్, తన సొంతూరు ఆముదాలవలసలో శరత్ బాబుకు ఇల్లు, ఆస్తులు ఉన్నట్టు సమాచారం. కొన్ని కోట్ల విలువ చేసే ఆస్తులు శరత్ బాబుకు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఆ ఆస్తి అంతా ఎవరికి చెందుతుందని ఇప్పుడు ప్రశ్నగా మారింది. శరత్ బాబుతో కలిసి మొత్తం అక్కాచెల్లెళ్లు, అన్నతమ్ములు 13 మంది కుటుంబం అని, వాళ్ళ పిల్లల చదువులు, పెళ్లిళ్లకు కూడా శరత్ బాబు సహాయం చేశాడని శరత్ బాబు సోదరి ఇటీవల తెలిపారు.

Sarath Babu : శరత్ బాబు అంతిమ యాత్రకు తరలివచ్చిన తలైవా.. నా ఆరోగ్యం కోసం ఆలోచించేవాడు అంటూ ఎమోషనల్ అయి..

ఇటీవల శరత్ బాబు అంత్యక్రియల సమయంలో అయన సోదరులని కొంతమంది ఆస్తుల గురించి ప్రశ్నించగా.. అది ఇప్పుడు మాట్లాడే సమయం కాదని, ఆయన వీలునామా రాస్తే దాని ప్రకారమే చెందుతాయని, లేకపోతే మా ఫ్యామిలీ అంతా కూర్చొని మాట్లాడుకుంటామని తెలిపినట్టు సమాచారం. దీంతో శరత్ బాబు కోట్ల విలువ చేసే ఆస్తులు తన సోదరులు, సోదరీమణులకు వెళ్తాయని టాక్ నడుస్తోంది. అయితే ఈ ఆస్తుల కోసం వారి మధ్య గొడవలు కూడా రావొచ్చని, ఇప్పటికే ఆ గొడవలు కూడా నడుస్తున్నట్టు తమిళ మీడియాలో కథనాలు వచ్చాయి.