Sarkaru Vaari Paata: ఎస్‌వీపీ@రూ.103 కోట్లు.. విజయవాడలో భారీ సెలబ్రేషన్స్!

సూపర్ స్టార్ మహేష్ మరోసారి తన మేనియా చూపిస్తున్నాడు. సర్కారు వారి పాట వంద కోట్ల క్లబ్ లో చేరింది. జస్ట్ రెండు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.103 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ఎస్వీపీ టీమ్ పోస్టర్స్ విడుదల చేశారు.

Sarkaru Vaari Paata: ఎస్‌వీపీ@రూ.103 కోట్లు.. విజయవాడలో భారీ సెలబ్రేషన్స్!

Sarkaru Vaari Paata

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ మరోసారి తన మేనియా చూపిస్తున్నాడు. సర్కారు వారి పాట వంద కోట్ల క్లబ్ లో చేరింది. జస్ట్ రెండు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.103 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ఎస్వీపీ టీమ్ పోస్టర్స్ విడుదల చేశారు. మొదటి రోజు రూ.75 కోట్ల గ్రాస్ రాబట్టిన సర్కారు వారి పాట రెండో రోజు వంద కోట్ల మార్క్ దాటేసింది. రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి సర్కారు వారి పాట రెండు రోజులకు రూ.48.5 కోట్ల షేర్ అందుకోగా.. మహేష్ కి బాగా పట్టున్న యూఎస్ మార్కెట్లో ప్రీమియర్స్ తోనే వన్ మిలియన్ మార్క్ చేరుకున్న సర్కారు వారి పాట రెండో రోజుకి $1.5 మిలియన్ క్రాస్ చేసింది.

Sarkaru Vaari Paata: ట్విట్టర్‌లో చండాలం.. మెగా-మహేష్ ఫ్యాన్స్ మధ్య బూతుల యుద్ధం!

యూఎస్ తో పాటు ఏపీలో సర్కారు వారి పాట కలెక్షన్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. హైదరాబాద్ సిటీలో కూడా సర్కారు వారి పాట మంచి వసూళ్లు రాబడుతుంది. ఇక, సెలవు దినాల నేపథ్యంలో శని, ఆదివారం ఈ చిత్ర కలెక్షన్స్ మరింత మెరుగు కావచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నిజానికి రెండో రోజు ఈ సినిమాకు 9 నుంచి 10 కోట్ల మధ్య షేర్ వస్తుందని ట్రేడ్ భావించింది. కానీ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ 11 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. 60శాతం ఆక్యుపెన్సీకి బదులు, 75శాతం ఆక్యుపెన్సీ పెరగడంతో షేర్ పెరిగింది.

Sarkaru Vaari Paata: యాంటీ ఫ్యాన్స్ రచ్చ.. ట్రెండింగ్‌లో #DisasterSVP హ్యాష్ ట్యాగ్!

పరశురామ్ దర్శకత్వంలో మహేష్-కీర్తిసురేష్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు మొదటి రోజు కాస్త మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ, రెండో రోజుకు సినిమా కోలుకుంది. మార్కెట్లో మరో పెద్ద సినిమా పోటీ లేకపోవడంతో, సర్కారువారి పాటకు ఆడియన్స్ క్యూ కడుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఆక్యుపెన్సీ ఎలా ఉండనుంది.. వసూళ్లపై ప్రభావం చూపిస్తుందా అన్నది చూడాల్సి ఉంది. కాగా, ఈ సినిమా సక్సెస్ పై భారీ సెలబ్రేషన్స్ చేస్తున్నట్లుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. మే 16 సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ గ్రౌండ్స్ విజయవాడలో సాయంత్రం 5 గంటల నుంచి ఈ వేడుక నిర్వహించనున్నారు.