MLC Elections : తెలంగాణలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు 96 నామినేషన్లు.. నేడు పరిశీలన

తెలంగాణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఘట్టంలో నామినేషన్ల పర్వం ముగిసింది. హైదరాబాద్‌ మినహా పాత తొమ్మిది జిల్లాల పరిధిలోని 12 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

MLC Elections : తెలంగాణలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు 96 నామినేషన్లు.. నేడు పరిశీలన

Telangana (1)

Scrutiny of MLC election nominations : తెలంగాణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఘట్టంలో నామినేషన్ల పర్వం ముగిసింది. హైదరాబాద్‌ మినహా పాత తొమ్మిది జిల్లాల పరిధిలోని 12 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 12 స్థానాలకు 96 నామినేషన్లు దాఖలయ్యాయి. టీఆర్ఎస్‌ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్‌ కొన్ని స్థానాలకు మాత్రమే పరిమితమైంది. టీఆర్ఎస్ తరుపున ఏడుగురు సిట్టింగ్‌లు, ఐదుగురు కొత్తవాళ్లు బరిలో ఉన్నారు. అయితే అధికార పార్టీకి పోటీగా అన్ని జిల్లాల్లో పోటీగా స్వతంత్రులే ఉన్నారు.

కాంగ్రెస్‌ మెదక్, ఖమ్మం జిల్లాలకే పరిమితం కాగా.. బీజేపీ పోటీకి దూరంగా ఉంటుంది. అత్యధికంగా ఆదిలాబాద్‌ జిల్లాలో 23 నామినేషన్లు దాఖలు కాగా.. అత్యల్పంగా రంగారెడ్డి జిల్లాలో రెండు స్థానాలకు మూడు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. నేడు నామినేషన్లను పరిశీలించగా..శుక్రవారం ఉపసంహరణకు గడువు విధించారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత బరిలో మిగిలే అభ్యర్థుల జాబితాపై క్లారిటీ రానుంది.

Tomato Price : సామాన్యుడికి షాక్..కిలో టమాటా ధర.130

కరీంనగర్, ఖమ్మం, మెదక్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తికరంగా మారగా.. రంగారెడ్డి, నిజామాబాద్‌, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలు ఏకగ్రీవమయ్యే అవకాశం కనిపిస్తోంది.. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులకే విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.. స్థానిక సంస్థల్లో గులాబీ పార్టీ ప్రజాప్రతినిధులే అత్యధికంగా ఉన్నారు.. దాదాపు అన్ని జిల్లాల్లో 80 శాతం మంది ప్రజాప్రతినిధులు అధికార పార్టీకి చెందిన వారే ఉన్నారు.. ఇక నామినేషన్ల దాఖలుకు నిన్ననే ఆఖరు కావడంతో అధికార పార్టీ అభ్యర్థులతో పాటు కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు వేశారు. రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ తరుపున పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్‌ రాజు నామినేషన్‌ దాఖలు చేశారు.

కరీంనగర్ నుంచి ఎల్‌.రమణ, భానుప్రసాద్‌రావుతో పాటు టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి రవీందర్‌ సింగ్ కూడా నామినేషన్‌ వేశారు. కరీంనగర్‌లో 2 స్థానాలకు అత్యధికంగా 22 మంది నామినేషన్లు దాఖలు చేశారు.. ఇందులో ఎక్కువమంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు.. మెదక్ నుంచి టీఆర్ఎస్ తరపున యాదవరెడ్డి, కాంగ్రెస్ తరుపున జగ్గారెడ్డి సతీమణి నిర్మల నామినేషన్ వేశారు. ఖమ్మం నుంచి టీఆర్ఎస్ తరపున తాతా మధు సూదన్, కాంగ్రెస్ నుంచి రాయల నాగేశ్వర్‌రావు నామినేషన్ వేశారు. దీంతో కరీంనగర్, ఖమ్మం, మెదక్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.

CM KCR : నాలుగో రోజు ఢిల్లీలో సీఎం కేసీఆర్.. ప్రధాని అపాయింట్ మెంట్ కోసం ఎదురుచూపులు

నల్గొండ నుంచి ఎంసీ కోటిరెడ్డి, ఆదిలాబాద్‌లో దండె విఠల్‌, వరంగల్‌లో పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నిజామాబాద్‌ నుంచి కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. మహబూబ్‌నగర్‌లో కూచికుల్ల దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి తమ నామినేషన్‌ దాఖలు చేశారు. వరంగల్‌లో ఒక స్థానానికి 15 నామినేషన్లు దాఖలయ్యాయి.. ఇందులో ఒకటి టీఆర్ఎస్‌ తరపున పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి దాఖలు చేయగా.. మిగిలిన 14 మంది ఇండిపెండెంట్లే ఉన్నారు..

అయితే వీలైనన్ని స్థానాలను ఏకగ్రీవంగా గెలుపొందేలా వ్యూహరచన చేస్తోంది అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ. పార్టీ ఓటర్లు చేజారకుండా ఉండేందుకు ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యే వరకు క్యాంపులకు తరలించాలని నిర్ణయించింది.. ఉమ్మడి జిల్లాల మంత్రులకు ఓటర్ల మద్దతు కూడగట్టడం, క్యాంపుల నిర్వహణ, అసంతృప్తులను బుజ్జగించడం, ఇండిపెండెంట్లకు నచ్చిచెప్పి పోటీ నుంచి వైదోలిగేలా చేసే బాధ్యతలను అప్పగించారు.