Maharashtra: ‘మ‌హా’ స‌ర్కారుకు షాక్.. 10 మంది ఎమ్మెల్యేల‌తో హోట‌ల్‌లో శివ‌సేన నేత‌, మంత్రి ఏక్‌నాథ్ షిండే

మ‌హారాష్ట్రలో రాజ‌కీయ సంక్షోభం త‌లెత్తే అవ‌కాశం ఉంద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌హారాష్ట్ర మంత్రి, శివ‌సేన కీల‌క నేత ఏక్‌నాథ్ షిండే గుజ‌రాత్‌లోని సూర‌త్‌లో ఓ హోట‌ల్‌లో 10 మంది పార్టీ ఎమ్మెల్యేల‌తో క‌లిసి ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Maharashtra: ‘మ‌హా’ స‌ర్కారుకు షాక్.. 10 మంది ఎమ్మెల్యేల‌తో హోట‌ల్‌లో శివ‌సేన నేత‌, మంత్రి ఏక్‌నాథ్ షిండే

Shivsena Uddav

Maharashtra: మ‌హారాష్ట్రలో రాజ‌కీయ సంక్షోభం త‌లెత్తే అవ‌కాశం ఉంద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌హారాష్ట్ర మంత్రి, శివ‌సేన కీల‌క నేత ఏక్‌నాథ్ షిండే గుజ‌రాత్‌లోని సూర‌త్‌లో ఓ హోట‌ల్‌లో 10 మంది పార్టీ ఎమ్మెల్యేల‌తో క‌లిసి ఉన్న‌ట్లు తెలుస్తోంది. శివ‌సేన అధిష్ఠానంపై ఆయ‌న కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఎవ‌రికీ అందుబాటులో లేరు. ఆయ‌న ఫోన్ కూడా క‌ల‌వ‌ట్లేదు. అలాగే, ఆయనతో పాటు ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఎవరికీ అందుబాటులో లేరు.

Food Combinations: ఈ కాంబినేషన్ ఆహార ప‌దార్థాలు అస్స‌లు తీసుకోవ‌ద్దు

అంతేగాక‌, నేటి మ‌ధ్యాహ్నం మీడియా స‌మావేశం నిర్వ‌హిస్తాన‌ని ఆయ‌న చెప్పారు. దీంతో ఆయ‌న ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న 10 మంది ఎమ్మెల్యేల‌తో క‌లిసి మ‌హా వికాస్ అఘాడీ ప్ర‌భుత్వానికి షాక్ ఇచ్చే అవ‌కాశం ఉంది. మ‌ధ్యాహ్నం ఏక్‌నాథ్ షిండే మీడియా స‌మావేశంలో మాట్లాడిన త‌ర్వాత ఈ విషయంపై స్ప‌ష్ట‌త రానుంది.

International Yoga Day: తాజ్‌ మ‌హ‌ల్‌, ఆగ్రా కోట స‌హా స్మార‌క చిహ్నాల్లో నేడు ప్ర‌వేశం ఉచితం

కాగా, గ‌త మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల అనంత‌రం బీజేపీ-శివ‌సేన విడిపోయిన విష‌యం తెలిసిందే. అనంత‌రం కాంగ్రెస్‌, నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీతో క‌లిసి శివ‌సేన ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. మ‌రోవైపు, మ‌హారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కాస్ ఓటింగ్ క‌లక‌లం చెల‌రేగింది. దీంతో శివ‌సేన ఎమ్మెల్యేల‌తో సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే కాసేప‌ట్లో అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు.