Balayya: సీనియర్ నటుడు బాలయ్య కన్నుమూత

సినీ రంగంలో మరో తార నేలరాలింది. ప్రముఖ సీనియర్ ఆర్టిస్ట్ ఎం.బాలయ్య శనివారం ఉదయం కన్నుమూశారు. తెలుగులో అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్.....

Balayya: సీనియర్ నటుడు బాలయ్య కన్నుమూత

Senior Actor M Balayya Dies At 94

Balayya: సినీ రంగంలో మరో తార నేలరాలింది. ప్రముఖ సీనియర్ ఆర్టిస్ట్ ఎం.బాలయ్య శనివారం ఉదయం కన్నుమూశారు. తెలుగులో అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బాలయ్య ప్రేక్షకులకు సుపరిచతం. నటుడిగా 300కు పైగా చిత్రాల్లో బాలయ్య నటించి ప్రేక్షకులను మెప్పించారు. కాగా ఆయన ఎత్తుకు పై ఎత్తు అనే సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేశారు.

బాలయ్య కేవలం నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా, కథా రచయితగా తన ప్రతిభను చాటుకున్నారు. అమృత ఫిల్మ్స్ బ్యానర్ ద్వారా శోభన్ బాబు హీరోగా చెల్లెలి కాపురం, కృష్ణ హీరోగా నేరము – శిక్ష, చుట్టాలున్నారు జాగ్రత్త, చిరంజీవి హీరోగా ఊరికిచ్చిన మాట లాంటి సినిమాలను బాలయ్య ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాలు ఆయనకు నిర్మాతగా మంచి పేరుతో పాటు పలు అవార్డులను తీసుకొచ్చాయి. ఇక దర్శకుడిగా పసుపు తాడు, నిజం చెబితే నేరమా, పోలీసు అల్లుడు వంటి సినిమాలను బాలయ్య డైరెక్ట్ చేశారు.

ఊరికిచ్చిన మాట చిత్రానికి గాను ఉత్తమ కథా రచయితగా బాలయ్య నంది అవార్డు అందుకున్నారు. చెల్లెలి కాపురం చిత్రానికి ఉత్తమ నిర్మాతగా ఆయన నంది అవార్డు అందుకున్నారు. ఇక బాలయ్య కుమారుడు తులసీరామ్ కూడా కొన్ని చిత్రాల్లో కథానాయకుడిగా నటించారు. 94 ఏళ్ల బాలయ్య యూసఫ్‌గూడలోని తన నివాసంలో మృతిచెందారు. బాలయ్య మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ బాలయ్య మృతిపై సంతాపం తెలిపారు. బాలయ్య భౌతిక కాయానికి పలువురు నివాళులు అర్పించారు.