Anchor Suma : సుమ వల్లే నేను బతుకుతున్నాను.. సీనియర్ నటి కన్నీళ్లు..

తాజాగా విడుదలైన క్యాష్ ప్రోమోలో సీనియర్ నటీనటులు సుభాషిణి, జెన్నీ, బాలాజీ, కృష్ణవేణి వచ్చి సందడి చేశారు. ప్రోమో చివర్లో యాంకర్ సుమ గొప్ప మనసు గురించి చెప్తూ కంటతడి పెట్టుకుంది సీనియర్ నటి సుభాషిణి.........

Anchor Suma : సుమ వల్లే నేను బతుకుతున్నాను.. సీనియర్ నటి కన్నీళ్లు..

Anchor Suma

Anchor Suma :  యాంకర్ సుమ గురించి అందరికి తెలిసిందే. తన మాటలతో అలరిస్తూ, తన షోలతో తెలుగు వారి ప్రతి ఇంట్లోనూ భాగస్వామిగా మారిపోయింది సుమ కనకాల. ఒక పక్క షోలు, సినిమా ఈవెంట్స్ చేస్తూ బిజీగా ఉంటూనే అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తుంది. సుమ పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యంతో ఇబ్బంది పడేవాళ్ళకు తన వంతు సహాయాన్ని అందిస్తుంది. తాజాగా సుమ హోస్ట్ చేసే క్యాష్ ప్రోగ్రాంలో ఓ సీనియర్ నటి సుమ తనకు చేసే సహాయం గురించి చెప్తూ ఎమోషనల్ అయింది.

Lingu Swamy : ది వారియర్ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుంది..

తాజాగా విడుదలైన క్యాష్ ప్రోమోలో సీనియర్ నటీనటులు సుభాషిణి, జెన్నీ, బాలాజీ, కృష్ణవేణి వచ్చి సందడి చేశారు. ప్రోమో చివర్లో యాంకర్ సుమ గొప్ప మనసు గురించి చెప్తూ కంటతడి పెట్టుకుంది సీనియర్ నటి సుభాషిణి. సుభాషిణి మాట్లాడుతూ.. ”నేను ఈ రోజు ఇలా ఆరోగ్యంగా ఉన్నాను అంటే దానికి కారణం సుమనే. నాకు ఆరు నెలలకు ఒకసారి మెడిసిన్స్ పంపిస్తుంది సుమ. మళ్లీ నాకు మానవ జన్మ ఉంటే నువ్వు నా కడుపున పాపగా పుట్టాలి. బంగారు తల్లివమ్మా నువ్వు” అని చెప్పడంతో సుమ కూడా ఎమోషనల్ అయి సుభాషిణిని హత్తుకుంది. సుభాషిణి కన్నీళ్లు పెట్టుకుంది. ఆ ప్రోమో చుసిన ప్రేక్షకులు కూడా కంటతడి పెడుతూ సుమ మంచితనాన్ని మెచ్చుకుంటున్నారు.